ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. స్పీకర్‌ చైర్‌ వరకు ప్రతిపక్షనేత చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. బంట్రోతుల్లా.. అనే పదం వాడారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. స్పీకర్‌ ఎన్నికపై మాకు ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. తనను పిలవకుండానే స్పీకర్‌ చైర్‌ స్థానం వరకు ఎలా వస్తాను? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. "నన్ను పిలవలేదు.. రికార్డులు చూడండి. స్పీకర్‌కు అభినందనలు తెలిపేందుకు అచ్చెన్నాయుడును పంపిస్తే బంట్రోతు అంటూ అహంభావంతో మాట్లాడుతున్నారు. అహంభావంతో వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతుండగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.

chevireddy 13062019

తాము బంట్రోతులమని మాట్లాడుతూ అధికారపార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సభలో అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ మాటలు అన్నందుకు సభలో ఆయన క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రికార్డులు చేసి .. ఆ వ్యాఖ్యలు ఉంటే తొలగిస్తానని అన్నారు. సభాపతి వ్యాఖ్యలపై సంతృప్తి చెందని అచ్చెన్నాయుడు.. తాము ప్రజాప్రతినిధులమా లేక బంట్రోతులమా? అన్నది స్పీకర్ చెప్పాలన్నారు. తాము చంద్రబాబుకు బంట్రోతులమైతే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెలు జగన్‌కు బంట్రోతులని వారు ఒప్పుకుంటే తాము కూడా చంద్రబాబు బంట్రోతులమని ఒప్పుకుంటామని అచ్చెన్నాయుడు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని రాద్దాంతం చేయదలచుకోలేదని, స్పీకరే ఒక నిర్ణయానికి రావాలని కోరారు. దీనిపై సభాపతి మాట్లాడుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రికార్డులు చూసి.. ఆ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి తొలగించి, ఏం చేయాలన్నదానిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.

10 రోజుల క్రితం, కేసిఆర్, జగన్, గవర్నర్ ఇంటికి భోజనానికి వెళ్లి, హైదరాబాద్ లో ఉన్న ఎపి ఆస్థులు, తెలంగాణాకు అప్పనంగా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఒక గంట భోజనం చేసి, రాష్ట్రానికి సంబధించిన ఆస్తులు సొంత ఆస్తులు లాగా పంచేసుకున్నారు. ఏపి ఆస్తులు, తెలంగాణాకు ఇస్తున్నాం అని, ఇక్కడ ప్రభుత్వం కనీసం ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. కనీసం క్యాబినెట్ సమావేశం పెట్టి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే స్పృహ కూడా లేకుండా, సొంత ఆస్తులు అయినట్టు, ఆంధ్రుల ఆస్తులు కేసిఆర్ కు జగన్ అప్పచెప్పేసారు. అయితే, దీని పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మరో స్టొరీని వైసిపీ ప్రాచారంలోకి తెచ్చింది. భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు కేసిఆర్ అంగీకరించారని, ఇది ప్రజా విజయం అంటూ హడావిడి చేసారు. అసలు బుర్ర ఉన్న ఎవరూ, కేసిఆర్ ఇలా ఇస్తాడు అంటే నమ్ముతారు. కాని, తమకు ఉన్న చానెల్స్, పేపర్స్ సపోర్ట్ తో హడావిడి చేసారు. ప్రజలు నిజమే అని కూడా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో, తెలంగాణా మంత్రి షాక్ ఇచ్చారు.

badhrachalam 13062019 2

భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే ప్రతిపాదన లేదని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల గడువున్నా హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అలాంటి ప్రతిపాదనలు ఏమీ జరగలేదని తాజాగా ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సహా, ఆరు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. ఆరు రాష్ట్రాల్లో నీటికొరత తీవ్రంగా ఉందని తెలిపింది. అందుబాటులో ఉన్న కొద్ది జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వర్షాలు ఆలస్యం కావడం, రుతుపవనాలు ఆశించిన ప్రభావం చూపకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని సూచించింది. గత పదేళ్ల సగటుతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితులు మరింత గడ్డుగా ఉన్నాయని పేర్కొంది. దశాబ్దకాలంలో రిజర్వాయర్లలో ఉన్న సగటు నీటి నిల్వలతో పోలిస్తే, ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు 20 శాతం కంటే తక్కువగా ఉన్న సందర్భంలో కరువు హెచ్చరికలు జారీ చేస్తారు. రిజర్వాయర్లు తిరిగి నీటితో నిండే వరకూ.. ఇప్పుడున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.

karavu 12062019

దేశవ్యాప్తంగా సీడబ్లూసీ పర్యవేక్షణలో 91 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రిజర్వాయర్లలో 3,599 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వలున్నాయి. మొత్తం రిజర్వాయర్ల నీటి సామర్థ్యంలో ఇది 22శాతం. గుజరాత్, మహారాష్ర్టల్లోని 27 రిజర్వాయర్లలో 13శాతం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని 31 రిజర్వాయర్లలో 13శాతం నీటి నిల్వలు ఉన్నాయని చెప్పింది. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని రిజర్వాయరల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అభినందనలు. తమ్మినేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ పిలుపునందుకుకుని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించింది.’’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన వెంటనే మైక్‌ పనిచేయలేదు. దీనిపై వైకాపా, తెదేపా నేతల మధ్య కాసేపు మాటలయుద్ధం సాగింది. గళం తగ్గదని.. పోరాటాలు తనకు కొత్త కాదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.

cbn 13062019

‘నా వాయిస్‌ ఏమీ తగ్గదు. నేను ఇవాళ వివాదాలకు పోదల్చుకోలేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భంలో మైక్ సరిగ్గా పనిచేయలేదు. మాట సరిగా రావడం లేదంటూ అధికార పక్ష సభ్యుల ఎద్దేవా చేశారు. ఇందుకు స్పందించన చంద్రబాబు.. " నా వాయిస్ తగ్గలేదు.. గట్టిగా మాట్లాడగలను. మా హయాంలో బాగా పని చేసిన మైకులు.. వైసీపీ రాగానే సరిగా పని చేయడం లేదు. ప్రతిపక్షం మాకేం కొత్త కాదు.. మా బాధ్యతలను మేం నిర్వర్తిస్తాం. శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్లు వస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో తమ్మినేని రాజకీయాల్లోకి వచ్చారు. అనేక పదవులను తమ్మినేని అలంకరించారు. స్పీకర్ స్థానంలో కూర్చొన్న తమ్మినేనికి అన్ని విధాలా సహకరిస్తాం" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read