గాడిదలు కాస్తున్నావా , దొబ్బెయ్.. అంటూ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో వైసిపీ మంత్రులు ఈ మాటలు అనటం విన్నాం. ఈ రోజు మరింత ముందుకెళ్ళి బూతులు కూడా తిడ్తున్నారు. నీ యమ్మ అంటూ ప్రతిపక్ష సభ్యులని తిడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యూస్షన్ హావర్ జరుగుతున్న సమయంలో, రేపల్లె ఎమ్మేల్యే అనగాని సత్య ప్రసాద్ అడిగిన ప్రశ్నలు, మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తున్న సమయంలో, ఈ దుమారం రేగింది. మంత్రి ప్రకటన పై టిడిపి నేతలు అభ్యంతరం చెప్పటంతో, తన పని తాను చేసుకుంటున్న అచ్చెన్నాయుడు పై పెర్ని నాని బూతులు మాట్లడారు. ఇక్కడే మన టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడుని అక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారు, నీ యమ్మ, ఇతన్ని ఎందుకు అసెంబ్లీకి పంపించామా అనుకుంటున్నారు అంటూ, బూతులు మాట్లాడారు. నీయమ్మ అని పేర్ని నాని అనగానే, జగన్ మోహన్ రెడ్డి పకపకా నవ్వుతూ ఆ మాటలని ఎంజాయ్ చేసారు.

దీని పై అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తన పని తాను చేసుకుంటుంటే, తనను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, తాను ఏమన్నా సభలో రౌడీయిజం చేశానని అని, బయటకు రా నీ అంతు చూస్తాం అంటున్నారని, బాధ పడ్డారు. తాను ఎక్కడైనా తప్పుడు పనులు చేస్తే, చెప్పండి, నేను అసెంబ్లీకి రాను అని చెప్పారు. మంత్రి మాట్లాడిన బూతులకు తెలుగుదేశం పార్టీ క్షమాపణ కోరింది. అయితే ఈ దశలో సభలో గందరగోళం ఏర్పడింది. వరుస పెట్టి వైసిపీ నేతలు మాట్లాడుతూ, ఎంతో అద్భుతమైన బడ్జెట్ ప్రవేశ పెట్టమని, ఈ చర్చ చెయ్యకుండా ఉండేదుకు, తెలుగుదేశం పార్టీ గొడవ చేస్తుందని ఆరోపించారు. అక్కడ నీ యమ్మ అంటూ కవ్వించింది వైసిపీ మంత్రి అయితే, తెలుగుదేశం సభ్యులనే ఎదురు తిడుతున్నారు. ఇన్ని బూతులు తిడుతున్నా, జగన్ మాత్రం, పకపకా నవ్వారు కాని, అది తప్పు అని మాత్రం, ఖండించలేదు.

తెలుగుదేశం పార్టీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని, గత మూడు రోజులుగా, సొంత పార్టీ నేత పై ట్విట్టర్ వార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం, వైసీపీ నేత పిటీషన్ తో వార్తల్లోకి ఎక్కారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా వైసిపీ నుంచి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పివిపి, కేశినేని నాని పై, వంద కోట్ల రూపాయాలకు పరువు నష్టం దావా వేసారు. దీంతో బెజవాడ రాజకీయం మళ్ళీ హీటెక్కింది. ఇప్పటికే కేశినేని, బుద్దా పై జరుగుతున్న ట్విట్టర్ వార్ తో, వార్తల్లోకి ఎక్కిన బెజవాడ రాజకీయం, ఇప్పుడు పీవీపీ ఎంట్రీతో, మరింత హాట్ గా మారింది. కేశినేని నాని పై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశానని, దీనికి సంబంధించి లీగల్ నోటీసులు కేశినేని నానికి పంపానని, వైసిపీ నేత పీవీపీ చెప్పారు. దీనికి సంబంధించి, లీగాల్ నోటీసులను, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో, తనను నేరస్తుడని, కేశినేని సంభోదించారని, ఆ విషమై, లీగల్ నోటీసులు పంపించినట్టు పీవీపీ తెలిపారు. తన పై ఎక్కడా కేసులు లేవని, అయినా తనను కేశినేని నాని నేరస్థుడు అంటున్నారని, ఆరోపించారు. పనామా పేపర్స్ లో తన పేరు ఉందని కేశినేని అన్నారని, అవి నిరూపించాలని, లేకపోతె లీగాల్ నోటీసులను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. ఈ విషయం పై ట్విట్టర్ లో పెడుతూ, నాని ఉద్దేశిస్తూ, మొన్న ఎవరో షో మాస్టర్ లు, టాస్క్ మాస్టర్ లు అన్నారు, టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చిన్న శాంపిల్ అంటూ లీగల్ నోటీసులు జత చేసారు. దీని పై నాని ట్విట్టర్ లో స్పందిస్తూ, ఈ ఉడత ఊపులు చిన్నప్పుడే చూసాను అంటూ, పీవీపీ ఇంత బారు రాసిన లీగల్ నోటీస్ ను, ఒక్క మాటతో తీసి అవతల పడేసారు.

ఒక పక్క చంద్రబాబు అన్నీ దుబారా ఖర్చులు పెట్టారు, చివరకు తాగే నీళ్ళు కూడా దుబారా, నీను కిన్లీ వాటర్ మాత్రమే తాగుతూ, పొడుపు చేసి, రాష్ట్ర సంపద పెంచుతున్నా అని చెప్తున్న జగన్ గారి మాటలకు, ఆయనతో పాటు, ఆయన మనుషులు చేసే పనులకు చాలా తేడా కనిపిస్తుంది. ఇప్పటికే జగన మోహన్ రెడ్డి తన ఇంటి కోసం ఇస్తున్న జీఓల పై టిడిపి అభ్యంతరం చెప్తుంది. జగన్ ఇంటి దగ్గర 1.5 కిమీ రోడ్డ కోసం 5 కోట్లు, టాయిలెట్ లు కట్టటానికి 30 లక్షలు, బ్యారికేడ్ లు కట్టటానికి 75 లక్షలు, కరెంటు పని చెయ్యటానికి 8.5 లక్షలు, ఇలా అనేక దుబారా ఖర్చులను తెలుగుదేశం ఎత్తి చూపిస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్తా సంచలనంగా మారింది. జగన్ బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మెన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. దీని పై జగన్ ఎలా స్పందిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

సహజంగా టిటిడి చైర్మెన్ కు తిరుమలలో క్యాంప్ కార్యాలయం ఉంటూ వస్తుంది. ఇంతకు ముందు వరకు చైర్మెన్ లు గా చేసిన వారు అందరూ ఇదే సాంప్రదాయం పాటిస్తూ, తిరుమలలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, కొత్త సంప్రదాయం సృష్టించారు. ఆయన తనకు తాడేపల్లిలో ఒక క్యాంపు కార్యాలయం కావాలని, టిటిడి పాలకమండలికి ఉత్తరం రాయటంతో, వారు ఆ పనిలో ఉన్నారు. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్, తాడేపల్లిలో ఏమి చేస్తారో మరి. అంతే కాదు, దీని కోసం, ఆయన నాకు ఆరుగురు సిబ్బంది కూడా కావాలని కోరారు. ఓ సూపరింటెండెంట్‌, ఇద్దరు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన జూనియర్‌ అసిస్టెంట్లు, ఓ అసిస్టెంట్‌ లేదా షరాబు, ఇద్దరు అటెండర్లను తన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కావాలని కోరారు. ఏకంగా చైర్మెన్ కోరితే, ఇక బోర్డు ఏమి చేస్తుంది. సరే అంది. అయితే ఎవరికీ అర్ధం కాని ప్రశ్న, తిరుమలలో సేవలు చెయ్యాల్సిన చైర్మెన్, తాడేపల్లిలో ఏమి చేస్తారా అని, ఈ నిర్ణయంతో టిటిడి అధికారులు అవాక్కయ్యారు. పొదుపు మంత్రం జపించే జగన్ గారు, ఇప్పుడు ఏమి చేస్తారో మరి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు వేసిన సెటైర్ కు, ఆర్ధిక మంత్రి బుగ్గన కూడా నవ్వుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ కంపెనీ పెట్టారంటే, అది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే అంటూ, మరోసారి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిన్నటి లెటర్ మళ్ళీ చదువుతూ, కియా ప్రెసిడెంట్, స్వయంగా, ఉత్తరం రాసారని, రాష్ట్రంలోనే అతి పెద్ద రెడ్డి ఇంటి పేరు ఉన్న మీరు అంటూ జగన్ ని సంభోదించి, లేఖ రాసారని, ఆనాడు వైఎస్ఆర్ ప్రాజెక్ట్ పెట్టమంటేనే, ఈ రోజు పెట్టుబడి పెట్టామని కియా ప్రెసిడెంట్ లెటర్ లో రాసారని చెప్పారు. బుగ్గన వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. నవ్వుతూ నవ్వుతూనే బుగ్గనకు కౌంటర్ లు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, బుగ్గన రాజేంద్రరెడ్డి గారూ, ఎంతో తెలివిగా మాట్లాడుతున్నారు. మీకు హ్యాట్సాఫ్ చెప్పాలి, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా అంటూ కియా విషయం పై చంద్రబాబు పంచ్ లు వేసారు.

2009లోనే రాజశేఖరెడ్డి గారు చనిపోతే, ఆయన ఆత్మ కియా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, 2016లో మీరు చంద్రబాబు దగ్గరకెళ్లండి, అయన అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, కియా అనంతపురంలో పెట్టండి అని వైఎస్ చెప్పారట. వైఎస్ చెప్పబట్టే కియా వచ్చి ఇక్కడ పెట్టారంట. ఎంత బాగా కధ చెపారు, మీరు ఎంతో గొప్ప నాయకులు, ఇలాంటి అబద్ధాలు కూడా అవలీలగా చెప్పేసి, నిజం అని నమ్మిస్తారు, మిమ్మల్ని ఈ విషయంలో, అభినందిస్తున్నా, మీకు కంగ్రాజ్యులేషన్స్ అని చంద్రబాబు అన్నారు. దీని పై బుగ్గన మాట్లాడుతూ, చంద్రబాబు నన్ను తెలివైన వారు అన్నారు, చాలా సంతోషం , కాని ఈ ఉత్తరం మాత్రం నిజమే కదా అంటూ, మళ్ళీ అదే విషయం చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఈ తరానికి, కియా మోటార్స్ కంపెనీ కేవలం ఆ రోజు వైఎస్ఆర్ చెప్పటం వల్లే వచ్చిందని, చెప్పేందుకు వైఎస్ఆర్ పార్టీ ఆడుతున్న ఆటను ప్రజలు గమనిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read