రెండు రోజుల విరామం అనంతరం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో, పెట్టుబడుల విషయం పై, అధికార ప్రతిపక్షానికి గొడవ జరిగింది. చంద్రబాబు పెట్టుబడులు అంటూ, విదేశాలు తిరిగి వచ్చారని, అనవసర ఖర్చులు అయ్యాయని, ఆయన విదేశీ పర్యటనల వల్ల ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాష్ట్రానికి రాలేదని బుగ్గన ఆరోపించారు. చివరకు చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న కియా పరిశ్రమ కూడా రాజశేఖర్ రెడ్డి 2007లో సియంగా ఉండగా, కియా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ లో పెట్టమని కోరాగా, వైఎస్ఆర్ కోరిక మేరకే చంద్రబాబు సియంగా ఉండగా కియా పరిశ్రమ పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే దీని పై చంద్రబాబు స్పందించారు. విభజన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పని చేసానని చెప్పారు. పెట్టుబడులు కోసమే విదేశీ పర్యటనలు చేసామని, దాని ఫలితాలు కూడా చూసామని, ఇంకా కొన్ని ఫాలో అప్ అయితే, అవి కూడా వచ్చే అవకాసం ఉందని, ఇప్పటి ప్రభుత్వాన్ని అదే కోరుతున్నా అని చెప్పారు.

విదేశీ పర్యటనల పై గోల చేస్తున్న వారు, మోడీ చేస్తున్న విదేశీ పర్యటనల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో పెట్టమని, మీరు వీలైతే ఆ స్థానాన్ని నిలబెట్టండి అని వైసిపీని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత, 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, మీరు అంతకంటే ఎక్కువ కంపెనీలు, ఉద్యోగాలు తీసుకురండి అని అన్నారు. అంతే కాని అనవసర విమర్శలు చెయ్యవద్దని కోరారు. నా పై విమర్శలు చేసే ముందు, మీ వెనుక ఉన్నవి చూసుకోండి అంటూ చురకలు అంటించారు. తన పై విమర్శలు కట్టి పెట్టి, ఈ రాష్ట్రం కోసం మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి అని కోరారు.

ప్రతి జిల్లాలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో, చంద్రబాబు సియం అయిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ దశలో చంద్రబాబు కొరియా పర్యటన సందర్భంగా కియా మోటార్స్ తో సమావేశం అయ్యి, వారు భారత దేశంలో పెట్టుబడులు పెట్టటానికి రెడీగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని, అందుకని అక్కడ పరిశ్రమ పెట్టాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం, గుజరాత, తమిళనాడు ప్రభుత్వాలు, కియా కంపెనీ కోసం పోటీ పడగా, చివరకు చంద్రబాబు కియా కంపెనీని ఒప్పించి అనంతపురం జిల్లా పెనుకొండలో పెట్టించారు. కియా తరువాత, అనేక అనుభంద సంస్థలు కూడా అక్కడకు వచ్చాయి. అక్కడ ఏకంగా ఒక కొరియా టౌన్షిప్ తాయారు అయ్యే పరిస్థితి వచ్చింది. మరో నెల రెండు నెలల్లో, అనంతపురం కియా కంపెనీ ప్లాంట్ నుంచి మొదటి కారు బయటకు రానుంది కూడా.

అయితే కియా దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి కావటంతో, దాని క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వటం ఇష్టం లేక, కియా కంపెనీ కేవలం మోడి వల్లే వచ్చింది అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే, కియా మోడీ తెచ్చాడో, చంద్రబాబు తెచ్చాడో అని ప్రజలు ఇప్పటికే కన్ఫ్యూషన్ లో ఉంటే, ఇప్పుడు మరో ఊహించని షాక్ ఇచ్చింది వైసిపీ ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ, కియా కంపెనీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల వచ్చింది అంటూ, అసెంబ్లీలో ప్రకటన చేసింది. దానికి ఒక లెటర్ చూపిస్తూ, కియా కంపెనీ ప్రెసిడెంట్ మాకు లెటర్ రాసారని, 2007లోనే రాజశేఖర్ రెడ్డి కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టమని కోరారని, దాని ప్రకారమే మేము ఏపిలో పెట్టుబడి పెట్టమని చెప్పనట్టు, బుగ్గన చదివి వినిపించారు. ఎప్పుడో 2007లో వైఎస్ఆర్ కోరితే, ఆయన కోరికే ప్రకారమే, ఈ రోజు కియా కంపెనీ ఏపిలో పెట్టుబడి పెట్టింది అంట. మరి ఏపికి రాక ముందు మహారాష్ట్ర, గుజరాత్ తో ఎందుకు పోటీ పడ్డారో ? మొన్న ఎన్నికల సమయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి,కియా కంపెనీ మోడీ వాల్లే వచ్చింది అని ఎందుకు చెప్పారో. పాపం, అప్పటికి జగన్ గారికి, ఈ ఉత్తరం అంది ఉండదు.

కేంద్రంతో కొనసాగిస్తున్న సఖ్యత నేపథ్యంలో మోడీ సర్కార్ తమ రాష్ట్రాలకు అరకొర నిధులు వెదజల్లినా ఏమీ అనలేక రెండు తెలుగు ప్రభుత్వాలు కక్కలేక...మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిపై తిరుగుబాటు చేయలేక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లబోదిబో అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ప్రతినిర్ణయానికి జైకొడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బీజేపీ ప్రభుత్వం షాక్లు ఇవ్వడం వెనక అంతర్యమేమిటీ..? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. బడ్జెట్ కేటాయింపుల్లో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఏపీలోని అధికార వైసీపీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీన్ రిపీట్ అవుతోందా..? 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసిపనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రెండు పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగాయి.

నాడు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి అనేక పర్యాయాలు బడ్జెట్లో అన్యాయం చేసిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం బీజేపీతో సానుకూల వైఖరితో వైసీపీ, టీఆర్ఎస్లు కొనసాగుతున్నాయి. అయినా ఏపీకి గానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి గానీ మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో న్యాయం చేయలేదన్న వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అన్యాయంపై నేరుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం స్పందించలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కక్కలేక... మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుంటే గతంలో టీడీపీకి చుక్కలు చూపించిన బీజేపీ ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలతోనూ అదే పంథా కొనసాగిస్తోందా...? అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇలా బడ్జెట్లో జరిగిన అన్యాయంపై గళం ఎత్తలేక, పోరాడలేక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కక్కలేక.. మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత, డీలా పడ్డ నాయకులను, క్యాడర్ ని మళ్ళీ ఆక్టివ్ చేసి, పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ఆక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. నేతలు పార్టీ మారుతున్నారు అనే వార్తలతో, క్యాడర్ డీలా పడకుండా, వారిలో ఉత్తేజం నింపేందుకు చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, అధికార పార్టీ పదే పదే అవినీతి మరకలు వేసి, అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండటంతో, ఆ ఆరోపణలు వెంటనే తిప్పి కొట్టేందుకు, కింద స్థాయిలో క్యాడర్ వెంటనే స్పందించే విధంగా, త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ త్రిసభ్య కమిటీలో ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఉంటారు. గుంటూరు జిల్లాకు త్రిసభ్య కమిటీ మెంబెర్స్ గా, పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, యనమల రామకృష్ణుడుతో పాటుగా, ఎమ్మెల్సీ ఆశోక్‌బాబును నియమించింది. గతంలో పార్టీలో ఏదన్నా సంక్షోభం వచ్చినప్పుడు, జిల్లాల్లో పార్టీ నాయకులు పార్టీ వీడే సందర్భంలో, లేకపోతే ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ఈ కమిటీలు వేసేవారు.

గుంటూరు జిల్లాలాగే, అన్ని జిల్లాల్లో కూడా ఈ త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ కమిటీలు ముఖ్యంగా, జిల్లాలో పార్టీని బలోపేతం చెయ్యటం, పార్టీ పై చేస్తున్న దాడులను ఎదుర్కోవటం, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు వెంటనే తిప్పి కొట్టే విధంగా, ఈ కమిటీ పని చేయ్యనుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా వారినికి 5 రోజులు గుంటూరులోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. కార్యకర్తల పై వరుస దాడులు తరువాత, వారికి అండగా ఉండేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు, చంద్రబాబు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజు కార్యకర్తలను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలాగే దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి పార్టీ తరుపున ఆర్ధిక సహయం కూడా చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read