విశాఖపట్నం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక రాజధాని.. ప్రశాంతమైన సిటీ. ఎంతో అద్భుతంగా ఉండే పర్యాటక సిటీ. హూద్ హూద్ వచ్చి విలయతాండవం చేసినా, వెంటనే కోలుకుని, మళ్ళీ పూర్వ వైభవం పొండింది. ఇలాంటి అద్భుతమైన, ప్రశాంతమైన సిటీ పై, విశాఖ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. క్రైస్తవులపైనా, చర్చిలపైనా దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి, చర్చిల దగ్గర బందోబస్తు పెంచండి, వాటికి రక్షణ కలిపించండి, అంతే కాదు నెలకు ఒకసారి, అసిస్టెంట్‌ కమిషనర్‌లు తమ పరిధిలోని అన్ని చర్చలకు వెళ్లి భద్రత ఎలా ఉందొ సమీక్ష చెయ్యాలని, ఎక్కడా దాడులు లేకుండా చూడాలని, విశాఖపట్నం నగర మేయర్ ఆర్కే మీనా కీలక ఆదేశాలు జారీ చేసారు.

vizag 18072019 2

అయితే పోలీస్ కమీషనర్ ఇచ్చిన ఈ ఆదేశాలు చర్చనీయంసం అయ్యాయి. ఇప్పటిదాకా విశాఖపట్నంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఒక్క చర్చి పైన కాని, ఒక్క క్రీస్టియన్ సోదరుడు పై కాని ఎలాంటి దాడులు జరగలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ నగరానికి ఆ చరిత్ర ఎప్పుడూ లేదని అంటున్నారు. అసలు మన రాష్ట్రంలోనే గత కొన్నేళ్ళుగా మత ఘర్షణలు లేవని, మరి అలాంటప్పుడు, ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చారా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు పోలీసులు ఇలా చేసారని ఆరా తియ్యగా, స్పందన కార్యక్రమంలో, డేనియల్‌ శ్యామ్‌ అనే ఒక వ్యక్తి, ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా, ఈ నెల 4వ తేదిన విశాఖ పోలీస్ కమీషనర్ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

vizag 18072019 3

పోలీస్ బాస్ నుంచే ఆదేశాలు రావటంతో, పోలీసులు కూడా చర్చిల దగ్గర పహారా పెంచారు. చర్చిలకు దగ్గర ఉండే, వీహెచ్పీ, బీజేపీ వారి పై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండటంతో, ఏమి జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. ఏ కారణం లేకుండా, ఎవరో ఒక అనామకుడు ఇచ్చిన వినతితో, అతను ఎవరూ, బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూడకుండా, ఇలా చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని, చర్చిలు కడుతూ ఉండటంతో, వారి పై ఆందోళనలు చెయ్యకుండా, ఇలా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారులు మాత్రం, శ్రీలంకలో జరిగిన దాడులు తరువాత, అప్రమత్తం అయ్యామని చెప్తున్నారు. అయితే, అది జరిగి మూడు నెలలు అవుతుందని, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడితో ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల్లో అపోహలు సృస్టించకుండ, గుడిలు, మసీదులు వద్ద కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, కొత్త చైర్మెన్ గా నియమించబడ్డ, జగన్ బంధువు, వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్ క్యాంపు కార్యాలయం, అమరావతిలో కూడా కావాలి అంటూ, ఒక లేఖ బయట పడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. టిటిడి చైర్మెన్ ఆదేశించారని, ఆయనకు వెంటనే తాడేపల్లి సమీపంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని, టిటిడి ఈఓకు దేవాదాయ శాఖ లేఖ రాసింది. చైర్మెన్ కోసం ఒక పెద్ద గది, దానికి అటాచేడ్ బాత్రూం ఉండాలి అని ప్రత్యేకంగా ఆ ఉత్తరంలో రాసారు. అంతే కాదు, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పని చెయ్యటానికి, ఆరుగు సిబ్బంది కూడా కావాలని ఆ లేఖలో కోరారు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఇప్పటికే తిరుమలలో చైర్మెన్ కు క్యాంపు కార్యాలయం ఉంది.

yv subba reddy 18072019 2

అక్కడ 21 మంది సిబ్బంది పని చేస్తున్నారు. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్ కు, తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం ఎందుకు అంటూ, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దాదపుగా రెండు రోజుల పాటు, ఇదే వార్త వైరల్ అయ్యింది. పొదుపు పొదుపు అంటూ ఒక పక్క డప్పు కొడుతూ, మరో పక్క ఈ దుబారా ఖర్చులు ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు పై పెద్ద ఎత్తున నిరసన రావటంతో, వైవీ సుబ్బారెడ్డి వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయన నిర్ణయం యు-టర్న్ తీసుకుంటూ, అబ్బే ఇదేమి లేదు అంటూ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సిన పరిస్థితి. ఒక పక్క లేఖలో స్పష్టంగా చైర్మెన్ కు కొత్త క్యాంపు కార్యాలయం కావాలి, దాంట్లో ఆరుగు సిబ్బంది కూడా కావాలి అని ఉంది.

yv subba reddy 18072019 3

అయితే నిన్న ప్రెస్ మీట్ లో సుబ్బారెడ్డి మాత్రం, ఇదంతా చంద్రబాబు, లోకేష్ కుట్ర అని కొట్టిపారేసారు. మాట మార్చిన సుబ్బారెడ్డి, అది క్యాంపు కార్యాలయం కాదని, అక్కడ సమాచార కేంద్రం మాత్రం ఏర్పాటు చెయ్యాలని కోరామని అన్నారు. ఇలాంటి సమాచార కేంద్రాలు, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ఢిల్లీలో కూడా ఇలాంటి సమాచార కేంద్రాలు ఉన్నాయని, అలాంటిదే మరొకటి అని చెప్పి మాట మార్చారు. మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలతో టిటిడి చైర్మెన్ ఆయన నిర్ణయం పై వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మరో పక్క ఇలాగే ఎల్1, ఎల్2 దర్శనాల రద్దు పై కూడా ప్రజల అందరూ మంచి నిర్ణయం అని అనుకున్నారు. కాని ఈ రోజు రద్దు చేసిన ఎల్1, ఎల్2 స్థానంలో, బిగినింగ్ బ్రేక్ దర్శనం అంటూ మరో పేరుతొ మొదలు పెట్టారు. పేరు ఏదైతే ఏమి, మా కష్టాలు మామూలే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

తెలుగు మీడియా రంగంలో, 24 గంటల వార్తా ఛానెల్ ను స్థాపించి, రాష్ట్రంలోనే కాక, దేశంలోనే ఒక ఊపు తీసుకొచ్చిన రవి ప్రకాష్ మరొక న్యూస్ ఛానల్ తో మన ముందుకు రానున్నారు. రవి ప్రకాష్ టీవీ9 ఛానెల్ ని ఎలా పైకి తెచ్చారో, ఆ ఛానెల్ ని ఒక సంచలనంగా ఎలా మార్చారో అందరూ చూసారు. ఎదో ముప్పు వస్తుందని గ్రహించి, కొద్ది నెలల క్రితం మోజో టీవీ అని మరొక న్యూస్ ఛానల్ కూడా మొదలు పెట్టారు. అయితే అనూహ్యంగా అలందా మీడియా ఎంటర్ అవ్వటం, టీవీ9, మోజో టీవీని హస్తగతం చేసుకోవటం, రవి ప్రకాష్ ని బయటకు గెంటేయటం జరిగిపోయాయి. మరో పక్క రవి ప్రకాష్ పై కేసులు కూడా పెట్టి వేధించారు. రవి ప్రకాష్ కోర్ట్ కు వెళ్లి, అరెస్ట్ చెయ్యకుండా బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. టీవీ9 అనే ఒక సంచలనం మొదలు పెట్టి, చివరకు బెయిల్ దాకా రవి ప్రకాష్ ప్రయాణం నడిచింది.

ravi 17072019 1

వీటి అన్నిటికీ కారణం, కేసిఆర్ తో పాటు ఆయన మాఫియా అయిన మైహోమ్స్ రామేశ్వర రావు, మేఘా కృష్ణా రెడ్డి అని బహిరంగంగానే విమర్శలు చేసారు రవి ప్రకాష్. తెలుగు మీడియాను వీరు కబ్జా చేస్తున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుందని, మిగతా ఛానెల్స్ కూడా లాక్కునే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారని ఆరోపించారు. రవి ప్రకాష్ ఆరోపించినట్టు గానే, మోజో టీవీని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రిందట ఆ ఛానెల్ సీఈఓ రేవతిని కూడా, పాత కేసును తిరగదొడి అరెస్ట్ చేసారు. అయితే కేసుల్లో ఇరుక్కుని, ఇబ్బందుల్లో ఉన్న రవి ప్రకాష్ ఏమి చెయ్యలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో హైకోర్ట్ లో రవి ప్రకాష్ కు ఊరట లభించింది. రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యవద్దు అంటూ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రవి ప్రకాష్ నెక్స్ట్ స్టెప్ పై మళ్ళీ ఆక్టివేట్ అయ్యారు.

ravi 17072019 1

ఈ నేపధ్యంలోనే, టీవీ9 మాజీ ఉద్యోగి జాకీర్ ఈ రోజు ఫేస్బుక్ లో లైవ్ వచ్చి, రవి ప్రకాష్ కొత్త టీవీ ఛానెల్ పెడుతున్నారని, ఆ వివరాలు త్వరలోనే చెప్తామని ప్రకటించారు. టీవీ ఛానెల్ పేరు టీవీ36 గా చెప్పారు. ఇక్కడ కూడా 3+6 = 9 వచ్చేలా జాగ్రత్త తీసుకున్నారు. రవి ప్రకాష్ ఛానెల్ పెట్టె ఏర్పాటులో ఉన్నారని, త్వరలోనే అన్ని వివరాలు చెప్తామని జాకీర్ చెప్తూ, రవి ప్రకాష్ పడుతున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చారు. అయితే రవి ప్రకాష్ కు బీజేపీ అండదండలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రవి ప్రకాష్ కంప్లైంట్ మేరకే, మొన్న మైహోం రామేశ్వరరావు పై ఐటి దాడులు జరిగాయని అందరికీ తెలిసిందే. ఇప్పటికే కేసిఆర్ పై బీజేపీ వార్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో రవి ప్రకాష్ చేత, బీజేపీ పెద్దలు న్యూస్ ఛానెల్ పెట్టిస్తున్నారా అనే వాదాన కూడా ఉంది. మొత్తానికి, ఈ మీడియా వార్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, జ్యుడిషియల్‌ కమిషన్‌ అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచంలో ఎవరూ చెయ్యని సాహసం చేస్తున్నా అని, జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుతో, ఈ రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికి రెండు నెలలు అవుతున్నా, కీలక ప్రాజెక్ట్ లు అన్నీ ఆగిపోయినా, ఆ జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏమైందో తెలియదు. అయితే జగన్ ఏర్పాటు చేస్తానంటున్న జ్యుడిషియల్‌ కమిషన్‌ పై చంద్రబాబు స్పందించారు. ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై జరిగిన ప్రెస్ మీట్ లో జ్యుడిషియల్‌ కమిషన్‌ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఒక విధంగా ఇది సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అంటూ గొప్పగా చెప్తుంటే, చంద్రబాబు మాత్రం ఒక్క మాటలు తీసి అవతల పడేసారు.

ppa 17072019 1

జ్యుడిషియల్‌ కమిషన్‌ అనేది పరిపాలనలో సాధ్యం అయ్యేది కాదని తేల్చి చెప్పారు. టెండర్ల విషయంలో ముందే జడ్జీలు జోక్యం చేసుకోరని, ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి గ్రహించాలని చంద్రబాబు అన్నారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ తో టెండర్లు పిలవటం అనేది సాధ్యం అయ్యే పని కాదని చంద్రబాబు అన్నారు. వైసిపీలో ఒక్కరికి కూడా సాంకేతిక అంశాల పై అవగాహన లేదని చంద్రబాబు అన్నారు. అన్ని విషయాలు వక్రీకరించి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఒప్పందాలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రం అని, అన్ని ఒప్పందాలు రెగ్యులేటరీ కమిషన్ ద్వరానే జరుగుతాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సాంకేతిక అంశాలు ప్రజలకు అర్ధం కావు కాబట్టి, మీమేదో అధిక రేట్లకు ఒప్పందాలు చేసుకుని, అవినీతి చేసామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

ppa 17072019 1

విద్యుత్ విషయంలో మేము 24 గంటలు కరెంట్ ఇచ్చి, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసామని, వీళ్ళు రెండు నెలల్లోనే అంతా అస్తవ్యస్తం చేసేసారని చంద్రబాబు అన్నారు. తెలంగాణా పై ఉన్న ప్రేమ, జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పై లేదని చంద్రబాబు అన్నారు. ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపించి, పబ్బం గడుపుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మరని, అధికారుల చేత ప్రెస్ మీట్ పెట్టించి, రాజకీయ ప్రసంగాలు చేపించి, వారి చేత అబద్ధాలు ఆడిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎందుకు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారో, ఆ అధికారులే చెప్పాలని చంద్రబాబు అన్నారు. అందరూ సౌర, పవన్ విద్యుత్ వైపు వెళ్తున్నారని, 2021 నాటికి 20 శాతం సాంప్రదాయేతర ఇంధనం చేరాలని గుర్తు చేసారు.

Advertisements

Latest Articles

Most Read