గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ, గత రెండు మూడు రోజలుగా, ఆంధ్రప్రదేశ్ర్ రాజకీయం తిరుగుతుంది. నాలుగు రోజులు క్రిందట చంద్రబాబుని కలిసి తన కష్టాలు చెప్పుకోవటం, తరువాత రోజు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కలవటం, ఆ తరువాత రోజు జగన్ మోహన్ రెడ్డిని కలవటం, తరువాత రాజకీయాలకు దూరం వెళ్తున్నట్టు చెప్పటం, ఇవన్నీ గందరగోళానికి దారి తీసాయి. పది రోజుల క్రిందట వంశీ పై పెట్టిన నకిలీ పట్టాల కేసు నుంచి మొదలైన ఈ గొడవ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఆ నకిలీ పట్టాల కేసులో, వంశీ దొరికిపోయారని, వంశీ అరెస్ట్ కు, పోలీసులు స్పీకర్ వద్ద పర్మిషన్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వంశీ అరెస్ట్ తప్పదు అనుకున్న టైంలో, మొత్తం రివర్స్ అయ్యి, విషయం మొత్తం వంశీ ఏ పార్టీలో చేరుతారు అనే విషయం చుట్టూ తిరుగుతుంది. అయితే వంశీ పై పెట్టిన కేసు ఏమైందో, పోలీసులు ఏమైపోయారో ఇప్పటికీ తెలీదు...

sujana 28102019 2

అయితే వంశీ, చంద్రబాబు మధ్య నిన్నటి నుంచి, లేఖలు నడుస్తున్నాయి. వంశీ పార్టీ మారుతున్నా, ఒత్తిళ్ళు తట్టుకోలేను అని చెప్పటం, దానికి చంద్రబాబు కలిసి పోరాడదాం అని చెప్పటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు సూచన మేరకు, కేశినేని నాని, కొనకళ్ళ నారయణ, వంశీతో చర్చలు జరపటానికి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పరిస్థితి ఇలా ఉంటే, అటు వైసిపీలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటికే అక్కడ ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఇంటి వద్ద 4 వేల మండి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు జగన్ తో భేటీ ఉంటుందని, అక్కడ తేల్చుకుందాం అని వెంకట్రావ్ అనుకున్నా, ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఇది వైసిపీ పరిస్థితి.

sujana 28102019 3

వంశీ మూడు పార్టీల నేతలను రెండు రోజుల గ్యాప్ లో కావటంతో, అటు టిడిపి వెనక్కు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. ఇక మిగిలింది బీజేపీ. వంశీ బీజేపీలో చేరటానికి కూడా ఆలోచన చేసారు. సుజనా చౌదరిని గుంటూరు వెళ్లి మరీ, ఒక బీజేపీ నేత ఇంట్లో కలిసారు. అయితే అనూహ్యంగా ఆ తరువాత రోజే జగన్ ను కలవటంతో, వంశీ బీజేపీలో చేరటం లేదని అర్ధమైంది. అయితే వంశీ తనను ఎందుకు కలిసారు, అనే విషయం పై ఈ రోజు సుజనా చౌదరి స్పందించారు. వంశీ తనను కలిసారని, తాను ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పారని, బీజేపీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది వంశీనే అని సుజనా అన్నారు. సామర్ధ్యం, సమర్ధత ఉన్న నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని సుజనా చౌదరి అన్నారు.

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఆర్ధికంగా, సామాజికంగా, విపరీత మార్పులు వస్తున్నాయి. బ్రతుకు మీద ఆశ పోతుంది. వీటి అన్నిటికీ కారణం ఇసుక కొరత. గత అయుదు నెలలుగా, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఇసుక కొరతతో, భవన నిర్మాణ కార్మికులు అల్లాడి పోతున్నారు. దాదపుగా 40 లక్షల మందికి, ఈ ఇసుక కొరత డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం ఎక్కడా స్పందించటం లేదు. మే 30న గద్దేనికిన జగన్, సెప్టెంబర్ 5 నాటికి, ఇసుక వస్తుందని, అప్పటి దాక ఇసుక బంద్ చేస్తున్నామని అన్నారు. అయితే, అప్పటి వరకు ఉన్న పాలసీని కొనసాగించాలాని కోరినా, జగన్ ఒప్పుకోలేదు. అయితే సెప్టెంబర్ 5 పోయి, నవంబర్ వస్తున్నా ఇంకా ఇసుక ఫ్రీ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న సమాధానం, వరదల వల్ల ఇసుక రావటం లేదని. అయితే వరదలు గట్టిగా, 3-4 జిల్లాల్లోనే ఉన్నాయి.

selfie 28102019 2

ఏది ఏమైనా ప్రభుత్వం సరిగ్గా స్పందించక పోవటంతో, భవన నిర్మాణ కార్మికుల జీవితాలు తారుమారు అయ్యాయి. ఈ అయుదు నెలలు, ఎలాగోలా, అప్పు చేసి, అది చేసి, ఇది చేసి నెట్టుకొచ్చామని, ఇక అప్పులు కూడా ఇచ్చేవారు లేరని, పస్తులు ఉంటూ, పెళ్ళాం బిడ్డలని బ్రతికించుకోలేక, తీవ్ర మనోవేదనకు గురై, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు, మన రాష్ట్రంలో నలుగురు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే, కళ్ళ వెంట నీళ్లు రాని వారు ఉండరు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ప్లంబర్ పోలెపల్లి వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు, సేల్ఫీ వీడియో తీసి, తన కష్టాలు అన్నీ వివరించాడు.

selfie 28102019 3

పనులు లేక, కుటుంబాన్ని పోషించలేక, ఆర్దిక ఇబ్బందులలో మునిగిపోయి, చేతకాని వాడిలా చనిపోతున్నాను అంటూ, సేల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే బలవన్మరణానికి పాల్పడిన తరువాత ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సమస్య పై ముందు నుంచి పోరాటం చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు. ఆ కార్మికుడి సేల్ఫీ వీడియో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. "అయిదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక మనోవేదనతో కార్మికులు బలవన్మరణాలు చేసుకోవడం మనసును కలచివేస్తోంది. సెల్ఫీ వీడియోలతో బలవన్మరణమే తమకిక శరణ్యంగా పేర్కొనడం చూసైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి.పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

వంశీ రాజీనామా విషయం ఇంకా సాగుతూనే ఉంది. నిన్న వంశీ వాట్స్అప్ లో, చంద్రబాబుకి రాజీనామా చేస్తున్న విషయాన్ని పంపించారు. అయితే, చంద్రబాబు దానికి రియాక్ట్ అవ్వరులే అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు వంశీ రాసిన వాట్స్అప్ కి, మళ్ళీ తిరిగి మెసేజ్ చేసి, ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని, కలిసి పోరాడదాం రండి అంటూ, బాల్ ని మళ్ళీ వంశీ కోర్ట్ లోకి నెట్టారు. దీని పై స్పందించిన వంశీ, ఇది వరకు దేవినేని నెహ్రు తో ఉన్న గొడవలు కాని, తరువాత ఐపీఎస్ సీతారామాంజనేయులుతో ఉన్న గొడవలు కాని ప్రస్తావిస్తూ, వాటిని ఎదుర్కున్నానని, ఇప్పుడు పరిస్థితి వేరని, కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నా అంటూ, మళ్ళీ చంద్రబాబుకి రిప్లై ఇచ్చారు. అయితే, దానికి కూడా చంద్రబాబు మళ్ళీ స్పందిస్తూ, తిరిగి వంశీకి మరో వాట్స్అప్ మెసేజ చేసారు. చంద్రబాబు మళ్ళీ ఈసారి కూడా, వంశీ కోర్ట్ లోనే బాల్ వేసి, వంశీని రియాక్ట్ అయ్యేలా చేసారు.

vammsi 28102019 2

మీరు చేసిన పోరాటాలు గుర్తు ఉన్నాయి. అప్పుడు పార్టీ కూడా మీకు అండగా నిలబడింది. ఇప్పుడు కూడా మీకు నిలబడుతుంది. మీకు మేము మద్దతుగా ఉంటాం. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించండి. వారిని మీ వద్దకు పంపుతున్నాం. ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం. అంటూ చంద్రబాబు మళ్ళీ వంశీకి వాట్స్అప్ మెసేజ్ చేసారు. అయితే, ఇప్పుడు వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది. వంశీ, ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే, వంశీ గన్నవరంలో అందుబాటులో లేరని, వంశీ హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది.

vammsi 28102019 3

ఇది చంద్రబాబు రాసిన రెండో రిప్లై... "Dear Vamsi, Received your second whatsapp message and noted all the contents. You have recollected your historical affinity with the party. It is true. You have earlier fought fiercely against injustice with extension of support from the party and myself. In the same manner party and myself are solidly behind you in this current fight against injustice of present YSRCP Government. In this regard I am entrusting Sri Kesineni Nani, MP and Sri Konakalla Narayana Rao, Ex-MP to coordinate with you and chalk out an action plan for a united against the high handedness of the present Government. I am assure you to sort out all other problems. With warm regards... N. Chandrababu Naidu"

రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, జగన్ పై అభిమానం ఉంది అని చెబుతూనే, జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, జగన్ పాలన ఎలా ఉంది అని అడగగా, బాగుంది అని చెప్పకుండా, ఇంకా అయుదు నెలలేగా అయ్యింది అంటూ, జగన్ పాలన పై అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ఇదే సందర్భంలో, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు చూస్తూ, జగన్ త్వరలోనే మళ్ళీ జైలుకు వెళ్తారు అనే విధంగా మాట్లాడారు. జగన్ కేసుల పై ఏమి జరుగుతుందొ, మీ అభిప్రాయం చెప్పండి అని ప్రశ్నించగా, జగన్ కు కష్ట కాలం ఉందని ఉండవల్లి అన్నారు. శశికళ విషయంలో ఏమి జరిగిందో, తెలుసు కదా, ఎలా ఆమె జైలుకు వెళ్లిందో చూసాం కదా అని అన్నారు.

undavalli 28102019 12

ఆమె వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా, సుప్రీం కోర్ట్ కేసును ముందు పెట్టి, అప్పటికప్పుడు ఆమెను జైల్లో పెట్టారని, ఇది మోడీ, అమిత్ షా చెయ్యగలిగేది అని అన్నారు. మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని, వారు ఈ దేశం కోసమే మేము పుట్టాం అని అనుకుంటూ ఉంటారని అన్నారు. జగన్ కేసుల విషయంలో, మొన్న మినహాయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ పై, సిబిఐ వేసిన అఫిడవిట్ చూస్తూనే, ఏమి జరుగుతుందో అర్ధం అవుతుందని అన్నారు. ఆ అఫిడవిట్ లో, సిబిఐ వాడిన భాష చూస్తూనే, విషయం తెలిసిపోతుందని, జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అనే చెప్పిన మాట, చాలా పవర్ఫుల్ అని, ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు. ఆ అఫిడవిట్ చదివితే, సిబిఐ, అమిత్ షా కంట్రోల్ లో ఉన్న సంస్థని తెలిసిపోయిందని అన్నారు.

undavalli 28102019 3

ఇక అదే విధంగా, తెలుగుదేశం పార్టీ పై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. 151 సీట్లు జగన్ కు వచ్చినా, వైసీపీ పార్టీ అనేది లేదనే నేను అనుకుంటా అని అన్నారు. ఆ గెలుపు కేవలం జగన్, వైఎస్ఆర్ ఇమేజ్ వల్ల వచ్చిందని, పార్టీ వల్ల కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, బలమైన క్యాడర్ ఉందని, పార్టీ పరంగా, టిడిపి ఎప్పటికీ బలంగానే ఉంటుందని, 23 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మర్చిపో కూడదు అని అన్నారు. 2004లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, కాని అనూహ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపో కూడదు అని అన్నారు. నాకు తెలిసి, వైసీపీ ఇంకా గ్రామస్థాయిలో బలపడలేదని ఉండవల్లి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయని, అన్నారు. జగన్ గెలవడం తనకు వ్యక్తిగతంగా ఆనందమే అని, కాని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ, స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఉండవల్లి జగన్ పై అభిమానంతో, డైరెక్ట్ గా చెప్పటం లేదని, గ్రౌండ్ లెవెల్ లో జగన్ కు వ్యతిరేకత ఎంతలా ఉందొ, ఉండవల్లి మాటలను బట్టి అర్ధం అవుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read