ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన రోజువారీ పెర్ఫార్మన్స్ లతో, ఆదరగొట్టెవారు ఏ ఛానల్ లో చూసినా, ఈయనే ఉంటూ, ప్రతి సందర్భంలో చంద్రబాబుని తిడుతూ ఉండేవారు. ఈయనకు తోడుగా జీవీఎల్ నరసింహారావు కూడా. అయితే అప్పట్లో అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి, రాజకీయంగా తిడుతున్నారు అనుకోవచ్చు, కాని ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయిన తరువాత, ఆరు నెలలు అయిన తరువాత కూడా, ఇప్పటికీ చంద్రబాబుని ప్రతి రోజు తిడుతూనే ఉన్నారు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎక్కడా పెద్దగా మాట్లాడటం లేదు. అయితే, పవన కళ్యాణ్ ఫాన్స్ తో పెట్టుకుని, నిన్న రాత్రి విష్ణు, ఇంటర్ నెట్ లో ట్రోల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇసుక దీక్ష పై, విష్ణువర్ధన్ రెడ్డి, తీవ్ర ఆరోపణలు చేసారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు కలిసి పోరాడతాయి కాని, ఇక్కడ విష్ణు మాత్రం, రివర్స్ లో, జగన్ ని అనకుండా, పవన్ ని అనటంతో, పవన్ ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్, నిన్న రాత్రి ఇంటర్నట్ లో రచ్చ రచ్చ చేసారు. విష్ణు వర్ధన్ రెడ్డి ట్విట్టర్ ఎకౌంటు లో, గతంలో ఆయన చేసిన ట్వీట్స్ అన్నీ బయటకు తీయటం మొదలు పెట్టరు. హీరొయిన్ల పై కామెంట్ లు చెయ్యటం, అలాగే కుల పరంగా విపరీతంగా తిట్టటం లాంటి ట్వీట్స్ అందులో ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, బీజేపీని, మోడీని కూడా తిట్టిన ట్వీట్స్ ఉన్నాయి. అయితే ఇది ఫేక్ ట్విట్టర్ ఖాతా అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే, ఈ ఎకౌంటు 2010 నుంచి ఉంది, అదీ కాక ఈ ట్విట్టర్ ఎకౌంటు లో, చంద్రబాబుని తిట్టే తిట్లు అన్నీ, పేపర్లలో, టీవీల్లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే అనేక మంది బీజేపీ వారు కూడా, ఈ ఎకౌంటుని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అంతే కాదు, విష్ణు మీద వచ్చే పోస్టర్స్ లో కూడా, ఇదే ట్విట్టర్ ఎకౌంటు ఉంటుంది.
అయితే ఈ రచ్చ అంతా అర్ధరాత్రి గమనించిన విష్ణు వర్ధన్ రెడ్డి, వెంటనే స్పందించారు. వెంటనే ప్రెస్ నాట్ విడుదల చేసారు. "సోషల్ మీడియా మిత్రులకు,అభిమానులకు & పార్టీ కార్యకర్తలకు ముఖ్య గమనిక..నా పేరు నాకు అదికారక ట్వట్టర్ అకీంటులేదు. నా పేరు మీద గత కొంత కాలంగా ఉన్న ట్విట్టర్ అకౌంట్ ని నడుపుతున్నది కోందరు అభిమానులు.వారు ఆ అకౌంట్ ని వేరే వ్యక్తి నుంచి పొంది ఉన్నారు ఇప్పుడుతెలిసింది. ఆ అకౌంట్ నుంచి గతంలో 7 నుండి 8 సంవత్సరాల క్రిందట ఎప్పుడో పెట్టిన పాత పోస్టులకు-కామెంటులకు నాకు ఎటువంటి సంబంధము లేదు. అవి కోన్ని కులాలను,మతాలను అవమానించే విధంగా ఉన్నాయని తెలిసి వెనువెంటనే ఆ అకౌంట్ ని తొలగించడం జరిగింది.అది నా అనధికార ట్విట్టర్ అకౌంట్ అని మీకు తెలియచేస్తున్నాను. బాధ్యతాయుత భారతదేశ పౌరుడిగా గత 23 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న నాకు కులాలు-మతాలు-వ్యక్తుల మీద అపార గౌరవం కలిగి ఉన్నాను.దూషణలకు నేను బద్ద వ్యతిరేకిని.ఇప్పటి వరకు రాజకీయంగా పార్టీలను-వ్యక్తులను అంశాల వారిగా విభేదించాను తప్పితే ఏ ఒక్క కులాన్నో-మతాన్నో-వ్యక్తులనో దుర్భాషలాడిన సంఘటనలు నా జీవితంలో ఇప్పటి వరకు చేయలేదు,చేయబోను. నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ తప్పుకి చింతిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలియజేయచున్నాను. త్వరలో నా అధికార ట్విట్టర్ కాతాను ప్రారంభించి మీకు తెలియజేస్తున్నాను." అంటూ విష్ణు ప్రెస్ నోట్ ఇచ్చారు.