గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి. వంశీ ఎటూ వెళ్తున్నారు, వంశీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంలో, ఇటు వంశీ అభిమానుల్లో, ఇటు తెలుగుదేశం పార్టీలో, అటు వైసీపీలో కూడా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మరో పక్క ఆటు వంశీని వదులుకోవటానికి సిద్దంగా లేమని తెలుగుదేశం పార్టీ అంటున్నా, వంశీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చంద్రబాబుతో వాట్స్అప్ లేఖలు రాసిన వంశీ, చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, కేశినేని నాని, కొనకళ్ళ నారాయణతో మాట్లాడండి అని చెప్పినా, వంశీ మాత్రం, అందుబాటులోకి రావటం లేదు. అయితే వంశీ నవంబర్ 3న వైసిపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వంశీ అనుచరులు, అన్ని గ్రామాల్లో తిరుగుతూ, వంశీకి మద్దతు కూడగట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే వైసిపీలో ఉన్న గన్నవరం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ పరిస్థితి ఘోరంగా ఉంది.

yarlagadda 30102019 2

వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు. యార్లగడ్డ అనుచరులు కూడా వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యార్లగడ్డ ఇంటికి దాదపుగా 4 వేల మంది పైగా కార్యకర్తలు వచ్చి, వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మొన్నటి దాక వంశీ మా పై కేసులు పెట్టారని, ఇప్పుడు అదే వంశీని పార్టీలో చేర్చుకోవటం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. అయితే, యార్లగడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమని జగన్ ప్రకటించారని, ఇదే విషయాన్ని, జిల్లా ఇంఛార్జి మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా యార్లగడ్డకు తెలిపారని తెలుస్తుంది. అయితే రాజ్యం లేని రాజు పదవి తనకు ఎందుకుని, వంశీకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని, తానె ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని యార్లగడ్డ అంటున్నారు.

yarlagadda 30102019 3

అయితే జగన్ మోహన్ రెడ్డి, సోమవారం యార్లగడ్డను వచ్చి కలవమని చెప్పారు. అయితే జగన్ ను కలిసే అవకాశం మాత్రం ఆయనకు కుదరలేదు. దీంతో సోమవారం జగన్ నివాసానికి వెళ్ళిన యార్లగడ్డ నిరాశతో తిరిగి వచ్చారు. మంగళవారం, బుధవారం అయినా తనని పిలుస్తారని అనుకున్నా, ఇప్పటి వరకు యార్లగడ్డకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తన అభిప్రాయం వైఎస్‌ జగన్‌కు తెలియచేసేందుకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరటం లేదని, యార్లగడ్డ వాపోతున్నారు. వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో, తాను ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి, మూడు రోజులుగా జగన్ అపాయింట్మెంట్ లేక, యార్లగడ్డ ఉసూరుమంటున్నారు.

నిన్న, ప్రభుత్వ భవనానికి, జాతీయ జెండా రంగులకు వైసీపీ రంగులు పూసి తమకు దేశం కన్నా మా పార్టీనే ముఖ్యమని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఈ చర్యతో దేశం మొత్తం, మన రాష్ట్ర చర్య పై, మండి పడింది. ఇక ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో ఏకంగా వినాయక విగ్రహాన్నే తొలగించి, జగన్ మోహన్ రెడ్డి తండ్రి అయిన వైస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అయితే స్థానికులు విషయం తెలుసుకుని తిరగబడటంతో, ఈ ఘోరం తప్పింది. లేకపోతే, వినాయకుడు ప్లేస్ లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. ఈ ఘటన, పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో జరిగింది. గ్రామంలో, వైయస్సార్ విగ్రహ ఏర్పాటులో చోటు చేసుకున్న ఈ వివాదం, ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యింది. గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తీసి, అక్కడ వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని, వైసీపీ నేతలు ప్రయత్నం చెయ్యటంతో, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి.చోటు చేసుకున్నాయి.

vinaak 3002019 2

నిన్న అర్ధరాత్రి సమయంలో, కొంత మంది వైసీపీ నేతలు, గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తొలగించి, ఆ స్థానంలో, వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు, చేసిన ప్రయత్నాలను పట్టిన్నపాలెం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే, తమ పై దాడి చేసారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టిన్నపాలెం గ్రామంలో, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం మూడు రోడ్ల కూడలి దగ్గర వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏడాది, అక్కడ వినాయక చవతి రోజుణ, వినాయకుని విగ్రహానికి ఉత్సవాలు జరపటం, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి రోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ఉన్న, స్థలం స్థానిక, గణిరాజా అనే వ్యక్తి ఇంటికి ముందు ఉంది.

vinaak 3002019 3

వీధిపోటు ఉండటంతో, ఆ స్థలం వదిలేసమని, అక్కడ మంచిది అని చెప్పి, వినాయకుడు విగ్రహం, గుడి పెట్టుకున్నామని గణిరాజా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, గత కొన్నిరోజుల నుండి అక్కడ ఉన్న వినాయకుని విగ్రహం తీసి, ఆ ప్లేస్ లో వైయస్సార్ విగ్రహాన్ని పెట్టాలని కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దౌర్జన్యంగా వైయస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు వైసీపీ నేతలు వచ్చారు. వినాయకుడు విగ్రహం తీసి, వైఎస్ఆర్ విగ్రహం పెట్టటం తమకు ఇష్టం లేదని, కావలని అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యం చేయటం ఏమిటని గణిరాజా కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విషయం పై, గణిరాజా కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటంతో, పోలీసుల వచ్చి, ఇలా చెయ్యద్దు అని కోరటంతో, ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లేనని సమాచారం. అయితే ఈ చర్యల పై టిడిపి మండిపడింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతమైన తెలుగుతల్లి గీతాన్ని ఆలపించడం ఆపేసారు, ఇకపై గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా తీసేసి వైఎస్ఆర్ విగ్రహాలో, రాజారెడ్డి విగ్రహాలో పెడతారేమో అని జనం బెంబేలెత్తిపోతున్నారు, అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్... జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అవ్వటం కోసం, చంద్రబాబుని డీ కొట్టటం కోసం, తన వల్ల, తన పార్టీ వల్ల కాక, బీహార్ నుంచి తెచ్చుకున్న పొలిటికల్ కన్సల్టెంట్. అయితే ప్రశాంత్ కిషోర్ వేసిన పాచికలు, చేసిన ప్రచారం, బాగా వర్క్ అవుట్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ, ప్రశాంత్ కిషోర్ చేసిన ఫేక్ ప్రచారాన్ని తట్టుకోలేక పోయింది. నిజాన్ని చెప్పటంలో ఫెయిల్ అయింది. దానిలో భాగంగానే, ఓటమి పాలు అయ్యింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రశాంత్ కిషోర్ పాత్ర మాత్రం, మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పాలి. అయితే, ఎన్నికలు అయిన తరువాత, ప్రశాంత్ కిషోర్, జగన్ పార్టీని వదిలేసారు. కొత్త ప్రాజెక్ట్ లు చేసుకుంటూ, వెళ్ళిపోయారు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలోనే, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పేరు రావటం, అదీ ప్రభుత్వంలోకి రావటం చూస్తుంటే, ఆశ్చర్యం కలుగక తప్పదు. జగన్ మోహన్ రెడ్డి, తనకు ఇష్టమైన వారికి, తనతో ఉన్న వారికి పదువులు ఇచ్చుకుంటూ వస్తున్నారు.

pk 29102019 2

ఇందులో భగంగా ఆంధ్రులని తిట్టిన అమర్ లాంటి వాళ్ళని, సాక్షిలో పని చేసిన రామచంద్రమూర్తి లాంటి వారిని కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నారు. అయితే, పార్టీలో పని చేసిన వారికి, పదవులు ఇవ్వటం వరకు పరవాలేదు. ఇది అందరూ చేసేది, ఎప్పుడూ చేసేదే. అయితే, ఇప్పుడు ఒక కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ కిషోర్ వర్గానికి కూడా ప్రభుత్వంలో పోస్టింగ్ లు ఇవ్వటం సంచలనంగా మారింది. కన్సల్టెంట్ అనే వాడు డబ్బులు తీసుకుని పని చేస్తారు, కాంట్రాక్టు అయిపోగానే వల్లిపోతారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న బ్రహ్మానంద పాత్రా అనే వ్యక్తికి, చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా, ఐ అండ్ పీఆర్ సోషల్ మీడియా యూనిట్ లో వ్యక్తిగా చెప్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది.

pk 29102019 3

అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ మాత్రం, ఇలా కన్సల్టెంట్ లని, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే, భవిష్యత్తులో వచ్చే అనేక అనర్ధాల గురించి. అసలు ఇలాంటి నియామకాల విషయంలో, ఐఏఎస్ లు అయినా, ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సింది. ఇలాంటివి నైతికంగా కరెక్ట్ కాదు అనే వాదన కూడా వస్తుంది. అయితే మరో పక్క వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తరువాత, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అని గమించిన వైసిపీ దీనికి విరుగుడుగా, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ నే సంప్రదించిందని, అందుకు అనుగుణంగానే, ఈ నియామకం జరిగిందని అంటున్నారు. మరో పక్క మాత్రం, ఇది ప్రశాంత్ కిషోర్ చేసుకున్న ఒప్పందంలో భాగమే అని అంటున్నారు. ఏది ఏమైనా, ప్రభుత్వాల ధోరణి ఇలా ఉండటం మంచిది కాదేమో.

తెలుగుదేశం పార్టీలో గెలిచిన 23 మంది నేతల పై, ఎలా అయినా అనర్హత వేటు వేయించాలనే ఉద్దేశంతో, ఏవేవో పిటీషన్లను, హైకోర్ట్ లో దాఖలు చేసింది వైసీపీ. సాక్షాత్తు చంద్రబాబు పైనే, ఇలాంటి కేసు మోపారు. చంద్రబాబు గతంలో సియంగా ఉంటూ జీతం తీసుకున్నారని, కాని ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం, వ్రుత్తి దగ్గర పొలిటీషియన్ అని పెట్టారని, జీతం తీసుకున్న వివరాలు పెట్టలేదు అని, చంద్రబాబుని అనర్హుడిగా ప్రకటించాలని, కోర్ట్ కు వెళ్ళింది వైసీపీ. ఇలా దాదపుగా ఏడుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేల పై కోర్ట్ కు వెళ్లారు. ఇవన్నీ ఏదో రాజకీయ పరమైన కేసులే అని ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఈ విషయం పై కోర్ట్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, అప్పటి వరకు ఎదురు చూద్దాం. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడదాం అనుకుంటే, ఇప్పుడు ఇలాంటి కేసులోనే, వైసిపీ ఎమ్మెల్యే బుక్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దీన్నే కర్మ ఫలం అంటారేమో.

kovind 30102019 2

ఏకంగా రాష్ట్రపతి భవన్ నుంచి, ఈ ఆదేశాలు వచ్చాయి. గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుల ధ్రువీకరణ పై ఇప్పుడు వివాదం రేగింది. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావటంతో, అసలు సమస్య మొదలైంది. ఆమె కులం విషమై రచ్చ మొదలైంది. చట్ట ప్రకారం దళితులు, మతం మార్చుకుంటే, వారి కులం ద్వారా వచ్చే రిజర్వేషన్‌ హక్కులు కోల్పోతారు. సరిగ్గా ఇదే ఈమె విషయంలో వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వినాయక చవితి వేడుకల్లో, జరిగిన వివాదం సందర్భంగా, తాను క్రిస్టియన్‌ అని, తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై అసలు రగడ మొదలైంది. లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన వారు, ఈ విషయం పై కోర్ట్ లో కేసు వెయ్యటమే కాకుండా, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసారు.

kovind 30102019 3

అయితే ఈ ఫిర్యాదు పై ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం స్పందించటం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగం పై వచ్చిన ఫిర్యాదు పై, పూర్తీ స్థాయిలో విచారణ జరిపి, తమకు రిపోర్ట్ ఇవ్వాలని, రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోవటంతో, ఈ విషయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణం, వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వివాదం. వినాయక చవితి పందిరి వద్దకు ఎమ్మెల్యే శ్రీదేవి పై అక్కడ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, దళితులను అవమానించారు అంటూ రచ్చ చేసి, జగన్ మోహన్ రెడ్డి, వద్ద పంచాయతీ పెట్టి, ఆ గ్రామానికి చెందిన కొంత మంది, టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. అయితే ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు వీడియో చూపిస్తూ, ఆమె పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా చెల్లవని పలువురు వాదించటంతో, ఆ సంఘటన ఆధారంగా తీసుకుని, ఆమె పై లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం పిటీషన్ వేసింది. ఇవన్నీ నిజమే అయితే, ఆమె ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read