nagarampalem police station 18012017

కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అన్ని వ్యవస్థల్లో అభివృద్ధి దిశగా అడుగులు పడుతూ మార్పులు వస్తున్నాయి. పోలీసు శాఖ కూడా ఆధునికత అందిపుచ్చకుంది. అధునాతన సాంకేతిక పరిజజ్ఞానం తోడుగా సమస్త సౌకర్యాలు ఉండేలా ఆధునిక పద్దతిలో మోడల్
పోలీస్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంలో రెండు మోడల్ పోలీస్టేషన్లను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. రెండు మోడల్ స్టేషన్ ల పనితీరు ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని నిర్మించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. ఒక్కో స్టేషన్ రూ, కోటి నిర్మాణం వ్యయం, 45 రోజుల కాలవ్యవధిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తో మోడల్ పోలీస్టేషన్లు నిర్మించారు. గుంటూరులోని నగరంపాలెం, పాత గుంటూరులో మోడల్ పోలీస్టేషన్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.

ఇవి ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ల ప్రత్యేకత

  • మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం
  • అన్ని అధునాతన హంగులు
  • స్టేషన్ మొత్తం సెంట్రల్ ఏసీ
  • సీఐకు ప్రత్యేక రూం
  • ముగ్గురు ఎస్ఐలకు మూడు రూంలు
  • స్టేషన్ రైటర్ కు ప్రత్యేక రూం
  • కంప్యూటర్ సెక్షన్ కు మరో రూం
  • కంప్యూటర్ టెక్నాలజీతో
  • ప్రతి విభాగానికి ప్రత్యేక గదులు
  • సిబ్బంది సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలు
  • కానిస్టేబుళ్లు విశ్రాంతి తీసుకోవడానికి స్టాఫ్ రూమ్ తో పాటు, రెండు బెడ్ లతో ప్రత్యెక రూమ్
  • స్టేషన్ లోనే టాయిలెట్లు
  • సిబ్బంది కార్యకలాపాలు సాగించడానికి వీలుగా ప్రత్యేక చాంబర్లను కార్పొరేట్ హంగులతో ఏర్పాటు
  • ఈ స్టేషన్ల ప్రారంభోత్సవం పూర్తయ్యాక అన్ని సీసీ కెమెరాలను ప్రత్యేకంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
  • స్టేషన్ పరిధి లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసందానం చేస్తారు

ఈ నెలాఖరున డీజీపీ నండూరి సాంబశివరావు ఈ మోడల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read