రాజధాని ఠీవి చూపించటానికి సిద్ధం అవుతుని, గన్నవరం ఎయిర్ పోర్ట్. రాజధానిలో 2017కు శుభారంభం గన్నవరం విమానాశ్రయంతో జరగబోతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు రాష్ట్రానికే ఐకానిక్ సింబల్ కానుంది. గన్నవరం విమానాశ్రయ నూతన టర్మీనల్ భవనం ఈ నెల 12న రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్గజపతిరాజులు జాతికి అంకితం చెయ్యనున్నారు.
2015 అక్టోబర్ 25న ప్రారంభించిన పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. సుమారు 160 కోట్లతో నిర్మిస్తున్ననూతన టెర్మినల్ 12,999 అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే 8618 అడుగుల విస్తీర్ణంలో జనరల్ ఎవియేషన్ లాంజ్ ఉంది. రెండు ఫ్లోర్లతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్‌లో ఒక గంటకు 500 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు, రాకపోకలు సాగించేందుకు వీలుంది. 16 చెక్‌ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్ కరౌజల్స్, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్ వంటివి అందుబాటులోనికి రానున్నాయి. ఎటా కనీసం 10లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది.
అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి ఇంటీరియర్ పనులు చేస్తున్నారు.
స్టీల్ అండ్ గ్లాస్ నమూనాతో వెలుపలి వైపు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఓ గోడపై గ్రీనరీతో గన్నవరం విమానాశ్రయమని పేరును తీర్చిదిద్తుతున్నారు. పక్కనే మూడు నీటి ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంతటి పెను తుఫానులు వచ్చినా తట్టు కోగలిగేలా నిర్మాణాన్ని చేపట్టారు.