విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్లలో నిన్న జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తుండగా, ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.. ఆరోగ్యశ్రీ పై, 108 పై విమర్శలు చేస్తూ, "నాన్నగారున్న సమయంలో 108 కాల్ చేయగానే... కుయ్.కుయ్.కుయ్ అని వచ్చేది... ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 108 సర్వీసులు అసలు పనిచేయట్లేదని ప్రసంగిస్తుండగా" ఆయనున్న వేదిక మీదిగా జనంలోంచి కుయ్.కుయ్ కుయ్ అని 108 దూసుకరావడం జరిగింది. కంగుతిన్న జగన్, అంబులెన్స్ ను చూసి, అది కవర్ చేసుకోవటానికి, చంద్రబాబు పై తిట్ల దండకం అందుకున్నారు. బహిరంగ సభ వద్దకు అంబులెన్స్ రావడంపై జగన్ విమర్శలు గుప్పించారు.
మనం మాట్లాడే మాటలు వింటున్నారు కనుకనే, ‘అంబులెన్స్’ ఇంకా బతికే ఉందని చూపించడం కోసం దీనిని ఇటువైపు పంపించారని అన్నారు. ఇక్కడ రోడ్డులో జనాలు ఉన్నప్పటికీ ఈ జనంలో నుంచి అంబులెన్స్ ను తీసుకువెళ్లాలని చూస్తున్నారంటే. ‘ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అయ్యా, చంద్రబాబునాయుడుగారు, నీకు సిగ్గులేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. బండి పోవడానికి దారి లేదని కనిపిస్తూనే ఉంది.. వేరే దారిలో పోకుండా.. ఇదే దారిలోనే పోతోంది. ఇది చంద్రబాబు కుట్ర కాక మరి ఏంటి. ఇలాంటి పనులు చంద్రబాబు చేస్తాడు అంటూ’ వింతగా రియాక్ట్ అయ్యారు.
‘వాళ్లు ఏ నికృష్టపు ఆలోచనతో చేసినా.. మనమైతే మంచే చేద్దాం..దారివ్వండి .. కొద్దిగా దారివ్వండి’ అంటూ అంబులెన్స్ కు వెంటనే దారి ఇవ్వాలని సభకు హాజరైన ప్రజలను, తమ కార్యకర్తలను జగన్ కోరారు. ‘అందులో పేషెంట్ ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలుసు.. రానీ..రానీ’ అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, ఆ అంబులెన్స్ లో ఆక్సిడెంట్ అయిన పేషెంట్ ఉన్నారు. జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, ఇక్కడ జనాలు ఉంటే అంబులెన్స్ రావటం ఏంటి, కావాలని పంపించారు అంటూ, చివరకు 108 పై కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసారు. మొత్తానికి, జగన్ కు రియల్ టైంలో గాలి పోయింది.