మీ వల్ల, మా సమస్యలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి... మా ఇంట్లో నుంచే సమస్యలు చెప్పే అవకాశం ఇచ్చారు... అవినీతి చేసినా చెప్పమన్నారు... మీ పుణ్యమా అని, మా సమస్యలు అన్నీ పరిష్కరమావుతుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటూ, ధన్యవాదాలు చెప్తున్నారు.... అదేంటి, ప్రతిపక్షం అయిన జగన్ పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజా సమస్య పై పోరాడకుండా, కేవలం ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్షతోనే ఉంది కదా, ఇంకా వీళ్ళని ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు అంటారా ? అవును... అసల ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించటం ఎప్పుడో మర్చిపోయింది... ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే 1100 మాత్రమే...
ప్రజలు ఏ సమస్య అయినా ఫిర్యాదు చెయ్యటానికి, క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతుంది... ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే, సంబంధిత అధికారుల నుంచి సమగ్ర సమాచారం కోసం, మళ్ళీ ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని, సమస్య పరిష్కరించి, ఫిర్యాదు చేసిన వారికి,మళ్ళీ ఫోన్ చేసి, వాళ్ళు సరే అంటేనే, ఆ ఫిర్యాదు క్లోజ్ చేస్తున్నారు... దీంతో ప్రజలు కూడా తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్లీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి కాల్ సెంటర్ అధికారులను, ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం నుంచి సహాయం పొందడంతోనే, ఊరుకోకుండా తమ కష్టం తీర్చిన వారికి కృతజ్ఞతలు చెప్పకునే సంస్కారాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు జనం..
సమస్య చిన్నదైనా, పెద్దదైనా దాని పరిష్కారం మన చేతుల్లో లేనప్పడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, పరిష్కారం కోసం ఎందరినో ఆశ్రయిస్తాం. తెలిసిన వాళ్లందరినీ సలహాలడుగుతాం...అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అందరి దగ్గరకూ వెళ్తాం... అయినా పరిష్కారం కానరాని ఎన్నో సమస్యలకు, ఎందరో బాధితులకు వరప్రదాయినిగా మారింది పరిష్కార వేదిక 1100... సమస్యలు పరిష్కారంతో పాటు, లంచాలు తదితర ఫిర్యాదులు కూడా చెయ్యవచ్చు... అలా ఫిర్యాదు చేసిన వాళ్ళలో, లంచాల తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం... నిజానికి, ఇది ఒక అద్భుతమైన ఆలోచన... ఫోన్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యటం అంటే మామూలు విషయం కావలి... ఏంతో పర్ఫెక్ట్ నెట్వర్క్ ఉండాలి... ఫిర్యాదు ప్రతి స్టేజి రిపోర్ట్ అవ్వాలి... చివరకు సమస్య పరిష్కారం అవ్వాలి... ఇదంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టే, ప్రజలు మన్ననలు పొందుతుంది... అంతే కాదు, దీని పని తీరు, సక్సెస్ స్టొరీ తెలుసుకున్న కిరణ్ బేడీ లాంటి వారు కూడా అభినందించి, ప్రధాని మోడీతో, ఇలాంటిది దేశం అంతా పెట్టాలి అని సిఫార్సు చేసారు...