టెక్నాలజీ... ఆధునిక పరిపాలనా వ్యవస్థలో పాలకులకు ఒక అస్త్రం. సమస్యలకు ఒక సులభ పరిష్కార వినియోగ వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ సెంటర్లు అవినీతి అధికారుల పై ప్రజలు నేరుగా ఘుళిపించే కొరడాగా మారుతున్నాయి... 'ప్రజలే ముందు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి... లంచాల సొమ్ము వెనక్కు ఇవ్వటం చూసాం... సమస్యలు పరిష్కారాలు చూస్తున్నాం... ఇప్పుడు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని కాపాడింది 1100... రెప్ప పాటులో, ఒక్క నిమషం ఆలస్యం అయినా, ఒక కుటుంబం బలి అయిపోయేది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
కృష్ణా జిల్లా మండల కేంద్రమైన జి.కొండూరులో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడబోతున్న ఒక కుటుంబాన్ని సకాలంలో స్పందించిన ఎస్ఐ డి.రాజేష్ రక్షించారు. జి.కొండూరులో నివసిస్తున్న ఒక కుటుంబ యజమాని తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలసి పరుగు మందును గ్లాసుల్లో పోసుకుని తాగేందుకు సిద్ధమయ్యారు. ముందుగా తన సమస్యను 1100 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి, తనకు సీఎం అపాయింట్మెంట్ కావాలని కోరాడు.
అతను చెప్పిన విధానాన్ని బట్టి బాధిత కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని పై శరవేగంగా స్పందించిన ఎస్ఐ డి.రాజేష్ బాధితుని ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఇంటికి తలుపులు వేసి ఉండటాన్ని గుర్తించి వాటిని పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా పరుగుమందుతో ఉన్న కుటుంబం కనిపించింది. బాధిత కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని, ఆత్మస్టైర్యంతో ఉండాలని ఎస్ఐ పేర్కొన్నారు. సకాలంలో స్పందించిన ఎస్ఐ రాజేష్ స్థానిక పోలీసుల పనితీరును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.