Sidebar

05
Wed, Mar

ఒక పక్క బాధ్యతల నుంచి పారిపోయి, మోడీ, అమిత్ షా లకు భయపడి, రాజీనామా చేసి, ఇంట్లో కూర్చున్న ఎంపీలు, మరో పక్క సిబిఐ, ఈడీ, ఐటి దాడులతో బెదిరిస్తున్నా, చివరకు ఆరోగ్యం బాగోకపోయినా, రాష్ట్రం కోసం మోడీ, అమిత్ షా లకు ఢిల్లీలోనే ఎదురు తిరుగుతున్న ఎంపీలు.. ఇది మన రాష్ట్రంలో వివిధ ప్రజా ప్రతినిధులు ఎలా ఉన్నారనేది తెలియటానికి ఒక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తున్న పోరాటం చూడలేక, వారిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసారు. లోక్‌సభ నుంచి 12 మంది టీడీపీ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభ మొదలవగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూఎంపీలు ఆందోళనకు దిగారు.

parliament 03012019

వెల్‌‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారిని నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎంపీలతో పాటు ఆందోళన చేస్తున్న తొమ్మిది మంది అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. కాగా సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు సభలోనే ఉంటూ నిరసనను తెలియజేస్తున్నారు. గతంలో ఎంపీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా జనవర 1 నుంచి వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని సస్పెండ్ చేయాలంటూ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

parliament 03012019

దీంతో సెక్షన్ 374ఏ ప్రకారం వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని నాలుగు లేదా ఐదు రోజుల పాటు సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నిన్న కావేరి జలాలపై ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న 14 మంది టీడీపీ ఎంపీలు, మిగిలిన 9 మంది అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12 మంది టీడీపీ ఎంపీలు: కొనకళ్ల నారాయణ, తోట నరసింహం, అశోక్ గజపతిరాజు నిమ్మల కిష్టప్ప గల్లా జయదేవ్ , మాల్యాద్రి శ్రీ రామ్, మాగంటి బాబు, మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, జేసీ దివాకర్‌రెడ్డి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read