కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నిర్లక్ష్యం నేపధ్యంలో, మిత్రపక్షం అయిన టీడీపీ, కేంద్రం పై గత వారం రోజులుగా నిరసన తెలుపుతూ, చట్ట సభల్లో, బయట కూడా ఆందోళన చేస్తూ, కేంద్రం పై ఒత్తిడికి ప్రయత్నం చేసింది... మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కలిసి ఒక రోజు బంద్ కూడా చేసి, కేంద్రం పై తమ నిరసన తెలియచేసారు... మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూ, నిరంతర ప్రక్రియ కొనసాగిస్తుంది... ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్ట్ ల కింద గత రెండు రోజుల్లో, రూ.1,269 కోట్లు విడుదల చేసింది...

money 10022018 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం గ్రాంట్స్ కింద పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.417.44 కోట్లు విడుదలకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసేంది... ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా రూ .4,329 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ .7,200 కోట్లు ఖర్చు చేసింది... రూ .3,217.63 కోట్లు ఖర్చు చేసాం అని, ఇవి కూడా ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే, కేంద్రానికి లెక్కలు పంపించింది... ఈ నిధులు కూడా వచ్చే వారం విడుదల అయ్యే అవకాసం ఉంది...

money 10022018 3

అలాగే 14 వ ఆర్థిక కమిషన్ సిఫారసు కింద, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు కోసం అని రూ.369.16 కోట్లు విడుదల చేసింది... ఆర్ధిక లోటు పై, గత రెండు రోజులుగా రాష్ట్ర అధికారులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి... ఇవి ఒక కొలిక్కి వస్తే కాని, ఆర్ధిక లోటు కింద, కేంద్రం ఎంత ఇస్తుంది అనేది స్పష్టం కాదు... మరో పక్క, స్టేట్ అర్బన్ లోకల్ బాడీస్ బేసిక్ గ్రాంట్ కోసమని రూ.253.74 కోట్లు విడుదల చేసింది... అనంగవాడీ సర్వీసెస్ పథకం కింద రూ .196.92 కోట్లు, ఎన్ఆర్ఈజీఏ పథకం కింద రూ.31.76 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మొత్తంగా, ఈ రెండు రోజుల్లో రూ.1,269 కోట్లు విడుదల చేసింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read