మొన్న ఒక మహానుభావుడు, హైదరాబాద్ నుంచి నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ వచ్చి, మన సియంకు మార్కులు వేసి, మళ్ళీ హైదరాబాద్ చెక్కేసాడు... ప్రతి రోజు 16 గంటలు కష్టపడి, ప్రతి రోజు సెక్రటేరియట్ కు వచ్చే చంద్రబాబుకి 2.5 మార్కులు వేసాడు, అసలు సెక్రటేరియట్ కు రాకుండా ఎక్కడ ఉంటాడో తెలియని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం 6 మార్కులు ఇచ్చాడు... ఎందుకు ఇంత తేడా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదు... ప్రతి రంగంలో, ఇద్దరి ముఖ్యమంత్రుల్ని ఒకసారి కంపేర్ చేసుకుని చూసుకున్నారు, ప్రతి దాంట్లో చంద్రబాబు ఎక్కడో ఉన్నారు... చివరకి ఈ మార్కులు వేసిన హైదరాబాద్ బాయ్ కి, ఎదో ఎజెండా ఉంది అని అర్ధమైంది...
ఈ రోజు మరో సారి ఒక సందర్భంలో ఇద్దరి ముఖ్యమంత్రులని కంపేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది... ఎందుకంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ టాప్ ప్లేయర్ హీరో మోటార్స్ తన ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పటానికి శంకుస్థాపన చేసింది... దీని వెనుక చంద్రబాబు కృషి ఎంత ఉందో, హీరో మోటార్స్ చైర్మన్ స్వయంగా చెప్పారు... చంద్రబాబు ఒక్క గంట ప్రెజెంటేషన్ ఇచ్చి, వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా పెట్టామో చెప్పారు.. ఇది విన్న తరువాత, చంద్రబాబు కృషికి మెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా ముఖ్యమంత్రికి 10కి, 10 మార్కులు వేసారు... మార్కులు వేసే వాళ్ళు, కనీసం ఒక 50 మంది పని చేసే కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి, మార్కులు వేస్తే ఇంకా బాగుండేది...
ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రం చేసిన ఒక పని, పత్రికాల్లో బాగా హైలైట్ అయ్యింది... తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి చైనా పారిశ్రామికవేత్తలు వచ్చారు.. అయితే, ఆ రాష్ట్రం ఇచ్చిన ఆతిధ్యం, మర్యాద చూసి, తీవ్ర అసంతృప్తికి గురయ్యి, వెళ్ళిపోయారు... 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది... ఇది తమను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది చైనా ప్రతినిధులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమమని, వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘనంగా స్వాగతం పలికేవారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ విధానాలు, ఇక్కడి నిబంధనలు, ఎఫ్‌డీఐ గురించి చర్చిద్దామని వస్తే పట్టించుకోలేదని ఐసీఈసీ ప్రతినిధుల ముందు వాపోయారు. పెట్టుబడులపై ఇక మీదట ప్రభుత్వాన్ని సంప్రదించకూడదని నిర్ణయించినట్లు సమాచారం... ఇలాంటి పనులు చేసినందుకు, 6 మార్కులు ఇచ్చాడు ఆ పెద్ద మనిషి...