Sidebar

21
Fri, Mar

పదిహేనేళ్ల క్రితం ప్రెసిడెంటునే తెచ్చినోడు.. ఆయన కట్టిన నగరానికి ఇవాళ ఒక ప్రెసిడెంటు కూతుర్ని తీసుకొచ్చి, ఆయన కట్టి ఇఛ్చిన కన్వెన్షన్ సెంటర్లోనే ఈవెంట్ చేసుకుంటూ ఆయన్నే ఎగతాళి చెయ్యాలని చుసిన వారికి చిన్న షాక్... ఆయన అంటే ఏంటో తెలుసా... మీరు సమ్మిట్ లు చేసుకుంటుంటే, ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు... ఆయన స్థాయి అది.... ఆయన్ను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది అందుకే... ఆయన్ను చూసి, మిగతా రాష్ట్రాలు అసూయ పడేది అందుకే... ఒకే రోజు రెండు టాప్ కంపెనీలు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చాయి... ఒకటి ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అశోక్ లేల్యాండ్, మరొకటి ఎంఎఫ్‌సీజీ తయారీ రంగంలో ముందున్న విప్రో ఎంటర్‌ప్రైజెస్...

cbn ashok 29112017 2

బుధవారం సచివాలయంలో విప్రో సంస్థ సీఎఫ్‌వో రాఘవ్ స్వామినాథన్, అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధంగా వున్నామని రాఘవ్ స్వామినాథన్ ముఖ్యమంత్రికి తెలిపారు. రూ. 200 కోట్లు నుంచి రూ. 350 కోట్లు పెట్టుబడి పెడతామని, తమ యూనిట్ నెలకొల్పేందుకు రాష్ట్రంలో 40 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. సబ్బులు, ఎల్‌ఈడీ ఉత్పత్తుల తయారీని చేపట్టాలని భావిస్తున్నట్టు వివరించారు.

cbn ashok 29112017 3

కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో అశోక్ లేల్యాండ్ బస్ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌కు సంబంధించి ప్లాన్‌ వివరాలను ముఖ్యమంత్రికి వినోద్ కె దాసరి అందించారు. మొత్తం 75 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌ ఏడాదికి 4,800 బస్సులు తయారు చేసే సామర్ధ్యం కలిగివుంటుందని, 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. బస్సుల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కేంద్రం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూకేటాయింపులు, ఇతర అనుమతులు పూర్తిగా వచ్చిన ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వరుస సమావేశాల్లో వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ సాల్మన్ ఆరోకియారాజ్ పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read