జరుగుతున్న అభివృద్ధి, చంద్రబాబు పడుతున్న కష్టం ఏ మాత్రం చూడకుండా, కేవలం ఆయన మీద బురద జల్లి, రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకునే వారికి ఇలాంటివి కనిపించవు... కనిపించినా, బయటకు చెప్పటానికి మనసు ఒప్పదు... అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటున్న వారికి, ఇలాంటివి అసలు కనిపించవు... కేవలం అమరావతి మీద బురద జల్లటమే అజెండా... లోకేష్ చేసిన ఇలాంటి పనులు కనిపించవు... ఎవరో అనుకుంటున్న మాటలు చెప్పటానికి మాత్రం నోరు వస్తుంది... రాజధాని అమరావతితోపాటు... రాయలసీమలోని తిరుపతిలో, ఉత్తరాంధ్రలోని విశాఖలోనూ ఐటి కంపెనీలు వస్తున్నా, కేవలం అమరావతిలోనే వచ్చేస్తున్నాయని ప్రచారం చేసి, రాష్ట్రంలో ప్రజలని రెచ్చగొడతారు... ఇవన్నీ పక్కన పెట్టి, అసలు విషయానికి వద్దాం...
గత సంవత్సరం ఐటి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ఫలితాలు ఇవి... విశాఖలో రెండు పెద్ద ఐటీ ప్రాజెక్టులు కొలువుదీరనున్నాయి... ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, కాండ్యుయెంట్ సంస్థలు ఈనెల 29న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా తమ కార్యక్రమాలను ప్రారంభిస్తాయి... మధురవాడ సర్వే సంఖ్య 309లో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థకు 40 ఎకరాలు కేటాయించారు.. అయితే, ఆ స్థలంలో నిర్మాణాలు పూర్తిచేసి కార్యక్రమాలను మొదలుపెట్టేసరికి సమయం పడుతుందని, సత్యం కూడలిలో ఉన్న టెక్‌మహేంద్ర సంస్థ ఆవరణలో తాత్కాలిక పద్ధతిన ఒక ఫ్లోర్‌ను ఈ సంస్థకు కేటాయించి, తక్షణం ఈ కంపెనీ ప్రారంభించనున్నారు...
అలాగే, కాండ్యుయెంట్ సంస్థకు మధురవాడ ఐటీ సెజ్‌లో నిర్మించనున్న మిలీనియం టవర్స్‌లో ఒకటి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈనెల 29న ఈ రెండు సంస్థల ప్రారంభోత్సవంతో పాటు విశాఖలో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఐఐఎం తొలి స్నాతకోత్సవానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. విశాఖ బీచ్‌లో జరగనున్న యాచింగ్ పోటీలను సీఎం ఆరోజు ప్రారంభిస్తారు...