ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్, పేపర్’ (APP) రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్ధాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు తీరంలో వున్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

companies 14022018 2

ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.

companies 14022018 3

అలాగే, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరిక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో వున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెలరోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read