ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌- జ్ఞాన వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గున్నారు.

అయితే వివాహ వేడుకలో పాల్గుని వెళ్తూ వెళ్తూ, తెదేపా నేత పయ్యావుల కేశవ్‌తో ఏకాంత సంభాషణ సాగించారు. హెలిప్యాడ్ వద్ద హెలిక్యాప్టర్ ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్లి వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఎర్రబల్లి, తెలంగాణా చీఫ్ సెక్రటరీ దగ్గరకు వస్తున్నా, రావద్దు అని సైగ చేసి, కేశవ్‌తో ఏకాంత సంభాషణ కొనసాగించారు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, జగన్ బీజేపితో కలవటం, కాకినాడ, నంద్యాల ఫలితాలు పై పయ్యావులతో కేసీఆర్‌ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నంద్యాలలో టిడిపి మంచి మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో అంతటి మెజార్టీ ఎలా సాధ్యమైంది, జగన్ చేసిన పొరపాట్లు, తెలుగుదేశం వ్యూహాలు గురించి మాట్లడుకున్నారని చెబుతున్నారు.

అంతే కాదు అనంతపురంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పై కూడా కేసిఆర్ అరా తీసారు... కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు, చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా పని చేసిన సమయంలో, అనంతపురం జిల్లాకి ఇంచార్జ్ మంత్రిగా ఉండేవారు.... ఆ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, అప్పుడు నీళ్ళు ఉండేవి కాదని, ఇప్పుడు ఎక్కడ చూసిన నీళ్ళు కన్పిస్తున్నాయని, 30 ఏళ్ళ తరువాత ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద చేరువైన బుక్కపట్నం చెరువు నీతితో కళకళ లాడటం చూసి, సంతోషంగా ఉంది అన్నారు... జిల్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఎంత వరకు వచ్చాయి... కృష్ణా నీరు ఎంత వస్తుంది, ఎంత అవసరం ఉంటుంది లాంటి విషయాలు కూడా చర్చించారు...

మొత్తానికి కేసిఆర్, పయ్యవులతో ఏకాంత భేటి హాట్ టాపిక్ అయ్యింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read