ఎన్టీఆర్ కుమార్తె అనే ట్యాగ్ తో, కాంగ్రెస్ పార్టీలో చేరి, కేంద్ర మంత్రి అయ్యి, కాంగ్రెస్ ఓడిపోగానే బీజేపీలో చేరిన పురంధీశ్వరి ఈ మధ్య ఎక్కడ చూసినా వార్తల్లో ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తూ, ప్రతి సందర్భంలోనూ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత చాలా మంది స్టేట్ బీజేపీ నాయకులు సైలెంట్ అయిపోయారు... కాని ఈవిడ మాత్రం, చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగత కోపంతో, విమర్శిస్తూనే ఉన్నారు...
అయితే ఈ మధ్య పురంధీశ్వరి హడావిడి అటు బీజేపీ పార్టీ వర్గాలని, ఇటు రాజకీయ విశ్లేషకులని ఆలోచింపచేస్తుంది... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్యన వారిధిలాగా మాట్లడుతూ, వచ్చే ఎన్నికల్లో సీట్లు గురించి కూడా మాట్లాడుతున్నారు.. బీజేపీ అత్యంత బలమైన పార్టీగా నిలిచేందుకు కృషి చేస్తాను అని చెప్తున్నారు... అలాగే చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేస్తుంది అని విమర్శలు చేస్తున్నారు....
ఈ దూకుడు వెనుక భారీ ప్లాన్ ఉంది అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధ్యక్షుడిని మారుస్తారు అనే ఊహగానాలు చాలా రోజులు నుంచి వస్తున్నాయి... హరిబాబుని కేంద్ర మంత్రిని చేసి, ఆ పదవి వేరే వారికి ఇస్తారనే వార్తలు వచ్చయి. దీంతో, ఆ అధ్యక్ష పదవి సంపాదించటానికి పురంధీశ్వరి పావులు కదుపుతున్నారు.... అందుకే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్సన అంటూ నిత్యం వార్తల్లో ఉంటూ, అధిష్టానం కళ్ళల్లో పడటానికి తాపత్రయ పడుతున్నారు...
దీని వెనుక భారీ వ్యూహం ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఒక్కసారి అధ్యక్ష పదవి సంపాదిస్తే, అధిష్టానం దగ్గర చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టవచ్చని, తెలుగుదేశం పార్టీని బీజేపీ నుంచి దూరం చేసి, జగన్ ని బీజేపీ వైపు తీసుకురావటం కాని, లేకపోతే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగి చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, అన్ని విషయల్లో చంద్రబాబు చెవిలో జోరీగలాగా మారి, చికాకు పెట్టి, చంద్రబాబుని సాధించాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని బలహీన పరచటం, ఈ వ్యూహం వెనుక పరమార్ధం అంటున్నారు...