అది ప్రపంచంలోనే ఒక పెద్ద ఎయిర్ లైన్స్ కార్యాలయం... ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్... దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడకి చేరుకొని వారితో సమావేశం అయ్యారు... నిజానికి, దుబాయ్ షేక్ లు,ఏ ఎవర్నీ అంత తేలికగా పొగడరు... చివరకి అమెరికాను కూడా లెక్క చెయ్యరు... అందునా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లాంటి అతి పెద్ద ఎయిర్ లైన్స్ కలిగినవారు అయితే, వారి పని వాళ్ళు చూసుకుని, వెళ్ళిపోతారు... స్ట్రిక్ట్ గా బిజినెస్ కు పరిమితమై మీటింగ్ ఉంటుంది... అందునా మన వైపు నుంచి వెళ్లి, వాళ్ళని పెట్టుబడులు పెట్టమని అడిగినప్పుడు సహజంగా వాళ్ళు కొంచెం బెట్టుగా ఉంటారు... కాని ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వేరు... ఆయన గ్లోబల్ లీడర్ అనటానికి ఇది ఒక ఉదాహరణ...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమిరేట్స్ ను మొదటిసారి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. ఒక పని తలపెడితే చంద్రబాబు కార్యదీక్ష ఎటువంటిదో తమకు ఇంకా జ్ఞాపకం ఉందన్నారు. ఇప్పటికీ చంద్రబాబులో అదే ఉత్సాహాన్ని చూస్తున్నామని ప్రశంసించారు. ఆ సందర్భంలో, అక్కడే ఉన్న ఇతర ప్రతినిధులు, చంద్రబాబుని అలా పొగుడుతుంటే షాక్ అయ్యారు... చంద్రబాబు గురించి తెలీని కొందరు, ఆయన సమర్ధత గురించి అరా తీసారు... మా బాస్ ఒక రాజకీయ నాయకుడుని, ఇలా పొగడటం ఎప్పుడూ చూడలేదు అంటున్నారు...
ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్ హబ్‌గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం మరింత బలపడుతుందని చంద్రబాబు అన్నారు. తమకు ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్, పోర్ట్స్ ల ప్రతినిధుల బృందంతో ఒక టాస్క్ ఫోర్స్ ఉందని, ఇరువురం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పని చేద్దామని ముఖ్యమంత్రి కి ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ ప్రతిపాదించారు.