విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ, చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైములో కాపు నేతలు అంతా మీటింగ్ అవ్వటం, అలాగే చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత, నేతలు అందరూ కలిసనా, బొండా రాకపోవటంతో, ఆయన పై అనుమనాలు పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతల పై, మాజీ మంత్రుల పై బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టపిక్ అయ్యాయి.  అయితే బొండా ఉమా మాత్రం, నేన్ పార్టీ మారటం లేదు అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. బొండా ఉమా అసంతృప్తిలో ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు, ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. అన్ని విషయాల పై చర్చించారు. జూలై 1 న కాపు నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేసానని, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పటంతో, బొండా ఉమా శాంతించారు. అయితే నిన్న అనూహ్యంగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉమా మళ్ళీ అలక పాన్పు ఎక్కారు. దీంతో మళ్ళీ చంద్రబాబు ఫోన్ చేసినట్టు సమాచారం.

నిన్న టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ, నియోజక్వారంలో కొంత మందికి ఫోన్లు వచ్చాయి. వాళ్ళల్లో కొంత మంది కార్పొరేటర్ లు కూడా ఉన్నారు. వారికి తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, బొండా ఉమా వెళ్ళిపోతే, మీ నియోజకవర్గంలో మరో బలమైన నాయకుడు ఎవరూ అంటూ, అడిగినట్టు వారు చెప్తున్నారు. బొండా ఉమాకు ప్రత్యామ్నాయం ఎవరూ అంటూ అడిగినట్టు సమాచారం. అయితే, ఈ ఫోన్లు వస్తున్న విషయాన్ని వీళ్ళు బొండా ఉమ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బొండా ఉమా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. తాను పార్టీ మారటం లేదని, ఏకంగా చంద్రబాబుకు చెప్పినా, ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.బొండా ఉమా మళ్ళీ అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు, గురువారం కూడా ఫోన్ చేసి మాట్లాడారు. తన ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా చేస్తే పార్టీ పరువు కూడా పోతుందని చంద్రబాబు వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి స్పందించిన చంద్రబాబు, పార్టీ పరంగా ఇలాంటి కాల్స్ ఏమి చెయ్యలేదని, నాకు తెలియకుండా ఎవరైనా చేస్తే వారి పై చర్యలు తీసుకుంటానని, చెప్పటంతో బొండా ఉమా శాంతించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read