గుజరాత్ ఎన్నికల్లో, చావు తప్పి కన్ను లొట్ట పోయినా, రాష్ట్ర బీజేపీ నాయకులకు జ్ఞాదోయం అవ్వలేదు... కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేని బీజేపీ నాయకుడుగా పేరు ఉన్న సోము వీర్రాజు విర్రవీగుతూ, నేను 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటూ, గుజరాత్ ఎన్నికల గెలుపు, ఈయన వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇస్తున్నారు.. అంతే కాదు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు అంటున్నారు... వచ్చే ఎన్నికల్లో తాము డిసైడ్ చేసే స్థితిలో ఉంటామని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల నాటికి మేము ఏమి చెప్తే అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అని అంటున్నారు...
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి గురించి చెప్పాలి అంటే వర్ణనాతీతం. ఆంధ్రాలో ఆ పార్టీ పయనం చుక్కాని లేని నావ లాగా ఉందంటే అంగీకరించక తప్పని వాస్తవం. ఎపిలో ఆ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల సంఖ్య మిగతా పార్టీలతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువే. అయినా వీళ్లలో వీళ్లకే పది గ్రూపులా అన్నట్లుంటుంది పరిస్థితి. ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులది చెరోదారి. ఇద్దరు ఎంపీల్లో ఎవరి దారి వారిదే.. ఈ సోము వీర్రాజు అయితే, జగన్ ఏ ట్యూన్ ఆడమంటే ఆ ట్యూన్ ఆడతాడు... ఈయనగారి సత్తా మొన్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికీ తెలిసిందే... అయినా, మళ్ళీ విర్ర వీగుతున్నారు.. పోలవరం, నిధులు, ఉమ్మడి ఆస్తులు లాంటి విషయాల్లో మాత్రం, ఈయన గారు ఒక్క మాట మాట్లాడడు...
మొన్నా మధ్య ఒకాయిన కాకినాడ వచ్చి, మాది పది జిల్లాల పార్టీ కాదు, జాతీయ పార్టీ, మీరెంత అని మన రాష్ట్ర పార్టీల గురించి అన్నాడు... నిన్న ఒకాయిన మేము తలుచుకుంటే, చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా రాదు అన్నాడు, ఇప్పుడు ఈ వీర్రాజు విర్రవీగుతూ, 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. 175 నియోజకవర్గాల్లో, 2014లో చంద్రబాబు వీరికి 15 సీట్లు ఇచ్చారు... చివరకు వీరు గెలిచింది 4... వీళ్ళు సియం సీటు గురించి, డిపాజిట్లు గురించి మాట్లాడుతున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటమే...