భారత రాజ్యాంగం కన్నా విశాఖ శారదా పీఠమే సీఎం జగన్మోహన్ రెడ్డికి మిన్న అనే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని, పార్లమెంట్ ఆమోదించిన ఏపి పునర్విభజన చట్టం కన్నా స్వామీజి  స్వరూపానంద శాసనమే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అంటూ, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ, " రాజధాని తరలింపుపై 5కోట్ల ప్రజల ఆందోళనలు కూడా ముఖ్యమంత్రి జగన్ కు పట్టడం లేదు. ఏ ప్రాంతం వారికెంత అసౌకర్యం ఉన్నా, ఎవరికెన్ని కష్టాలు ఎదురైనా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అటు క్రిస్టియానిటి, ఇటు హిందూయిజం మధ్య తన ద్వంద్వ ప్రవృత్తి కప్పెట్టడానికే శారదాపీఠంకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారు. కాశీ, హరిద్వార్ లకు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి, పరిశుద్ద పరిచి, హిందూ ఓట్లకు చేరువ చేసి, సీఎం అయ్యేందుకు దోహదపడింది ఈ స్వరూపానంద  స్వామీజినే.. వసుధా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయినప్పటికీ ఆయనతో హిందుత్వ విధానంలో యాగాలు చేయించిందీ ఈయనే.. తనకోసం ఇంతచేసిన స్వామీజి స్వరూపానందకు గురుదక్షిణగానే రాజధాని విశాఖకు జగన్మోహన్ రెడ్డి తరలింపు నిర్ణయం. "

jagan 08012020 2

"రాజధానిపై వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతికి రాసిన లేఖ, కేంద్రానికి పంపిన వినతి అర్ధరహితమైనవి. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. అమరావతిని ఏపి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇటీవల సర్వే డిపార్ట్ మెంట్ మ్యాప్ లో మన రాజధానిగా అమరావతిని చూపకపోతే రాష్ట్ర ఎంపిలే పార్లమెంటులో పట్టుబట్టడంతో, కేంద్రం అమరావతిని రాజధానిగా చూపిస్తూ మరో మ్యాప్ విడుదల చేసింది. ఈ అంశాన్ని లోక్ సభలో రెయిజ్ చేసింది టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అయినా, తమ ఎంపి మిధున్ రెడ్డి ఘనతగా అప్పట్లో వైసిపి చెప్పుకుంది. ఇప్పుడదే వైసిపి ఎంపి ఎందుకని నోరు తెరవడం లేదు రాజధాని తరలింపుపై..
ఏపిలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఇళ్లనుంచి బైటకు వచ్చే పరిస్థితి లేదు. "

jagan 08012020 3

"మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగానిరసనలుక్ హేస్తున్నారు. ఇటువంటి విధ్వంసకర పాలన మున్నెన్నడూ చూడలేదు.  సీఎం జగన్ ఏ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలుస్తున్నారో అర్ధం చేసుకోవాలి. ఇది రాష్ట్రానికి మరింత నష్టం చేయడమే అవుతుంది. ఇప్పటికే ఏపిలో పరిస్థితులు పొరుగు రాష్ట్రాల మంత్రుల ముందు నవ్వులపాలైంది. ఆయా రాష్ట్రాలకు ఏపిలో పరిస్థితులు ఏవిధంగా లాభదాయకమో అక్కడి మంత్రులే చెబ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత నష్టం చేయడం, పొరుగు రాష్ట్రాలకు చేతనైనంత మేళ్లు చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నారు.  ఈ రోజు శారదాపీఠం స్వామీజితో భేటి, 13న తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటి వెనుక స్కెచ్ అందరికీ తెలిసిందే..ఈ ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు...ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటే.  ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని ప్రజలే అంటున్నారు. " అంటూ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read