రాజధానినిర్మాణం కోసం స్వచ్చందంగా భూములిచ్చి సహకరించిన తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వ నిర్ణయంపై శాంతియుతంగా నిరస-నలు వ్యక్తం చేస్తుంటే అకారణంగా దాడికి పాల్పడ్డారని పోలీసులపై జాతీయ మహిళా కమిషను రాజధాని మహిళలు, రైతులు ఫిర్యాదు చేశారు. నక్స-లైట్లు, టెర్రరి-స్టులను ఏ విధంగా అణచివేస్తారో అదే తరహాలో తమపట్ల పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామంలో పోలీసులు మహిళలపై లా-ఠీ-ఛార్జ్ చేసిన ఘటనను సుమో-టోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఆదివారం విజయవాడ క్లబ్ కు చేరుకుంది. మహిళా కమిషన్ కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్, సీనియర్ కోఆర్డినేటర్ కాంచన కట్టర్‌ను తొలుత టీడీపీ ప్రతినిధి బృందం కలిసి, అమరావతి పరిణామాలను వివరించింది. గడిచిన 25 రోజులుగా పోలీసులు మహిళలు, రైతుల పట్ల వ్యవహరించిన తీరును క్షుణ్ణంగా వివరించింది. దాదాపు 3 వేల మంది మహిళలను పోలీసు-లు ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదు చేసారు.
గత 26 రోజులుగా, అయితే నిత్యం వేలాది మంది పోలీ-సులతో ఉన్న అమరావతి ప్రాంతం, నిన్న మధ్యానం నుంచి మాత్రం మారిపోయింది. పోలీసు-ల తీరుతో, అక్కడ వారు అవాక్కయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో పోలీసులు మాయమయ్యారు. గడిచిన 25 రోజులుగా వేలసంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు ఆదివారం మచ్చుకు కూడా కనపడకపోవడం విశేషం. ఇదే విషయాన్ని తుళ్లూరు మహిళలు, రైతులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. రోజు వేల సంఖ్యలో పోలీ-సులు తమ గ్రామాల్లో ముళ్లకంచెలు వేసి అడ్డుకుంటున్నారని మీ పర్యటనతో వారంతా మాయమయ్యారని తెలిపారు. అంతేకాకుండా నిన్న-నేడు పేరిట రైతులు ఒక వీడియోను విడుదల చేశారు. దానికి సంబంధించిన ప్రతిని మహిళా కమిషన్‌కు అందజేశారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, ముఖ్యంగా మహిళ లపై జరుగుతున్న దా-డుల తీరును చూసి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు స్పందించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ మహిళా కమిషనను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆదివారం ట్విట్టర్‌లో ఆయన విమర్శించారు. మహి కలు నోరువిప్పితే వైకాపా ప్రభుత్వం చేసిన నీచమైన పనులు ప్రపంచానికి తెలుస్తాయని భయమా? అంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 1-4-4 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లలోనే బంధి-స్తారా అని నిలదీశారు. పోలీసుల ముసుగులో మహిళలపై జరిగిన దా-డి దాచేస్తే దాగద న్నారు. పోలీసుల బూ-టు-కాలితో తన్నించారని విమర్శించారు. ఆందోళ-న-కారులను విడిచిపెట్టడానికి కులం ప్రస్తావన కూడా తెస్తున్నారని వాపోయారు. మహిళలపై పోలీసుల ముసుగులో జరిగిన అరాచ కాలన్నిటినీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామ న్నారు. మహిళలపై జరిగిన దా-డి ఫొటో లను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.