మండలిలో జరిగిన పరిణామాల పై, తాను గ్యాలరీలో కూర్చున్న సమయంలో జరిగిన అంశాల పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు.. "ఒక రాష్ట్రం-ఒకే రాజధాని’’ అంశంపై రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఘోషిస్తున్నా వైసిపి ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం, ఎదురుదాడి చేయడం శోచనీయం. ఉదయం 9గం కు కేబినెట్, 10గం బిల్లు పెట్టడం, 11గం కు చర్చ అనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎప్పుడు బిల్లు పెట్టినా 2రోజులు ముందు పెట్టి, అవగాహన కల్పించడం, ఆ తరువాత చర్చ కు అవకాశం ఇవ్వడం చేస్తారు. అలాంటిది బిల్లు పెట్టడానికి స్పీకర్ విచక్షణాధికారాన్ని వాడటం ఇప్పుడే చూశాం. రాజధాని బిల్లుపై సర్వత్రా ఉత్వంఠ..సిఆర్ డిఏ రద్దు చేస్తారా, రాజధాని మారుస్తారా ఏం చేస్తారా అని..ఇంత సీరియస్ బిల్లుపై కనీసం సమయం ఇవ్వకుండా, మా డిప్యూటి లీడర్ అచ్చెన్నాయుడు 2గం సమయం అడిగినా ఇవ్వకుండా ఏకపక్షంగా బిల్లు తెచ్చారు. అధికార పార్టీ బిల్లులు తెస్తుంది...సవరణలు చేయడం, సెలెక్ట్ కమిటికి పంపడం ప్రతిపక్షం బాధ్యత. బిల్లుపై మాట్లాడటానికి సాయంత్రం దాకా మాకు అవకాశం ఇవ్వకపోవడం, రామానాయుడు లేకుండా చూసి అప్పుడు మైకు ఇవ్వడం(అవకాశం ఇవ్వాలని స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి అడిగేటప్పుడు).. ఎంత నీచ రాజకీయం చేస్తున్నారు.. సీరియస్ బిల్లుపై చర్చకు...పోరాడితే, పోరాడితే రాత్రి అయ్యాక మైక్ ఇచ్చారు నాకు.. బిల్లులో ఏం ఉందో, లాభనష్టాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని లేదు వైసిపి వాళ్లకు..పూర్తి సమయం నన్ను తిట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మార్షల్స్ తో మమ్మల్ని బైటకు నెట్టేశారు. అర్ధరాత్రి నన్ను పుట్టలమ్మటా, గుట్టలమ్మటా, డొంకరోడ్లపై 3గంటలు అర్ధరాత్రిదాకా తిప్పారు. కడాన మంగళగిరిలో మారూమూల వదిలేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర నిలదీస్తే సమాధానం చెప్పరు. మాజీ సిఎంను, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి అంతా తిప్పుతారా..? "

"రాజధానిని ఎందుకు మారుస్తున్నారంటే 60మంది మాపై దాడి చేస్తారు. వీళ్లను బైటపడేయండి అని మార్షల్స్ కు ముఖ్యమంత్రే ఆదేశాలిస్తారు, రింగు ఒకటి పెట్టండి, దాటితే బైటపడేయండని అంటారు. అప్పుడు స్పీకర్ మార్షల్స్ ను పిలుస్తారు, వీళ్లను సీట్లలో కూర్చోపెట్టండి లేదా బైట పడేయండని అంటారు. ప్రజా సమస్యల తీవ్రతను బట్టి ప్రతిపక్షంలో సుందరయ్య అంతటి వ్యక్తే బెంచి ఎక్కారు. సర్వవిధాలా పోరాడే హక్కు ప్రతిపక్షానికి ఉంది. విభజన చట్టం వచ్చినప్పుడు రెండేళ్లు పార్లమెంటులో పోరాడారు. అభ్యంతరాలు చెప్పేందుకు రైతులకు జనవరి 20 సాయంత్రం 3గం దాకా టైమ్ ఇస్తే, ఉదయం 10గంటలకే బిల్లు ఎలా టేబుల్ చేస్తారు..? ఇక కౌన్సిల్ లో తంతు విషయానికి వస్తే..కరెంట్ కట్ చేస్తారు, ప్రసారాలు నిలిపేస్తారు, 3చానళ్లను అనుమతించరు, ఇంటర్నెట్ కూడా కట్ చేస్తారు. రూమ్ లో కూర్చున్న మాకు ప్రసారాలు ఇవ్వరు. ఛైర్ పర్సన్ ఆదేశిస్తే ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కట్ చేస్తారు. శాసన మండలి సభాపతి ఆదేశాలంటే మీకు లెక్కే లేదా..? పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, గౌతు లచ్చన్న, భాట్టం శ్రీరామ మూర్తిలతో కలిసి పనిచేశాం. 11మంది ముఖ్యమంత్రులను నేను చూశాను. ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. సీఎంగా నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి మైకు ఇచ్చేవాళ్లం, ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు మైక్ ఇచ్చేవారు. కానీ ఈ అరాచక పరిస్థితి ఎప్పుడూ చూడలేదు."

"కౌన్సిల్ ఛైర్ పర్సన్ ఛాంబర్ లోనే 22మంది మంత్రులు తిష్ట వేయడం, ఆయనను గుక్క తిప్పుకోకుండా చేశారు. ఏ 2, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి గ్యాలరీలోనే 2రోజులు మకాం వేశారు. ఎమ్మెల్సీలకు ప్రలోభాలు పెట్టారు. పోతుల సునీతకు పార్టీ ఎంతో చేసింది, ఉద్యమం నుంచి బైటకు వచ్చిన సీతక్కతో పాటు సీటు ఇచ్చాం. పరిటాల రవి అనుచరుడని ఆమె భర్తను ఆదరించాం. అన్నివిధాలా ఆదుకుంటే ఆమెను ప్రలోభపెట్టారు. ఆదినారాయణ రెడ్డిని రాజీనామా చేయించి, శివనాధ రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే ఆయనను లాక్కున్నారు. రూల్ 71పై చర్చ అంటే ఈ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన చర్చ అది. కౌన్సిల్ గొడవల్లో మేము ఇచ్చిన లేఖ ఛెయిర్ పర్సన్ చదవలేక పోయారు. అయినా 9మంది సభ్యులతో కౌన్సిల్ లో మీరు ఎలా ఆమోదించుకోగలరు..? కౌన్సిల్ సభాపతిని పట్టుకుని, ‘‘సాయిబుకే పుట్టావా..? నీ అంతు చూస్తాం’’ అని బొత్స అంటారా..? "

"నేను గ్యాలరీలోనే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో రూమ్ లో కూర్చోవడం సరైందికాదనే గ్యాలరీలోకి వచ్చాను. 14ఏళ్ల సీఎంనైన నన్ను అడ్వయిజర్ వచ్చి వెళ్లిపొమ్మంటాడా..? మార్షల్ వచ్చి వెళ్లిపొమ్మంటారా..? కౌన్సిల్ ఛెయిర్ పర్సన్ ను చెప్పమనండి వెళ్లిపోతా అని చెప్పాను. నిబంధనలు పాటించే తొలి పౌరుడిగా నేను ఉంటాననేది అందరికీ తెలుసు..అందుకే అడగ్గానే సెల్ ఫోన్ ఇచ్చేశాను. అలాంటిది కిందనుంచి పైకి వాటర్ బాటిల్స్ విసురుతారా..? పైనుంచి కిందకు కాగితాలు విసిరేస్తారా..? నాకు అడ్డంగా ఒకరు నించుంటారా..? నన్ను మానసికంగా హింసించాలని చూస్తారా..? మీరు కొడితే నేను గమ్మున ఉండాల్నా..? నా ముందే కులం పేరుతో ఛెయిర్ పర్సన్ ను పట్టుకుని బూతులు తిడతారా... ఆయన తల్లిని, తండ్రిని, కులాన్ని, మతాన్ని తిడతారా..? బజారు రౌడీల మాదిరి వ్యవహరిస్తారా..? ఆయన చేసిన తప్పేంటి..? ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటం ఆయన చేసిన తప్పా..? రూమ్ లో ఆయనను మీ మంత్రులు కొట్టబోతే బచ్చుల అర్జునుడు కాపాడి క్షేమంగా తీసుకెళ్లాడు. మీరేం దున్నపోతులా..? ఆర్టికల్ 169పై తప్ప ఎప్పుడూ మండలి గురించి శాసన సభలో చర్చించకూడదు. ఇవి రెండూ స్వయం ప్రతిపత్తిగల సంస్థలు. రాజ్యాంగం చెప్పింది అదే. ఒక సభలో చర్చను మరో సభలో వక్రీకరించి మాట్లాడటం, అనుమతి లేకుండా తెరపై ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్దం కాదా..?

"బిల్లులపై సెలెక్ట్ కమిటి వేశారు, అవుట్ కమ్ రావాల్సివుందని మీ ఏజినే కోర్టులో అఫిడవిట్ వేశారు. అదివచ్చేదాకా కార్యాలయాల తరలించరాదని అంటున్నారు. అమ్మవడి, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ బిల్లులను సాధారణ బిల్లుగా వస్తే సవరణలు చేసి పంపితే పాత బిల్లునే ద్రవ్యబిల్లుగా మార్చి మళ్లీ పంపిస్తారా..? అది జరగలేదని కౌన్సిల్ పై ఉక్రోషమా..? అందరినీ కొనేయాలని హార్స్ ట్రేడింగ్ చేస్తారా..? నేను ఎవరినీ పార్టీలోకి తీసుకోను,విలువలతో రాజకీయం చేస్తాను గప్పాలు కొట్టి ఇప్పుడు చేస్తున్నదేంటి..? నీ సహ నిందితులందరికీ ప్రభుత్వంలో పదవులిస్తారా..? టిటిడి పదవులా..? అడ్వయిజర్ పదవులా..? ఇక సాక్షులకు ఇంకెన్ని ఇస్తారో..? ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బౌన్సెస్ ఉంటాయి. 3వ్యవస్థలు పట్టుకొమ్మలు ప్రజాస్వామ్యానికి. లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్..మీడియా ఫోర్త్ ఎస్టేట్. అలాంటి మీడియాను చంపేస్తున్నారు. ఈ ఉన్మాద ప్రభుత్వాన్ని ఏం చేయాలో అదే చేస్తాం. తదుపరి కార్యాచరణ ఆదివారం టిడిఎల్ పిలో నిర్ణయిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు."

Advertisements

Advertisements

Latest Articles

Most Read