జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రజావ్యతిరేకచర్యలను, గతంలో ఒప్పుకొని, ఇప్పుడు మాటతప్పిన ఆయన తీరుని ప్రశ్నించామన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్సీలపై కక్షకట్టి, మండలినిరద్దు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆక్షేపించారు. సోమవారం ఆయన మరోఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 151మంది వైసీపీ ఎమ్మెల్యేలుం టే, వారిలో 84మందిపై కేసులున్నాయని, అలాంటివారుపెద్దలసభను రద్దు చేయడం దురదృష్టకరమని దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రజలు ఇప్పటికైనా మేలుకోకుంటే, భవిష్యత్‌లో అధికారపార్టీ ఆధ్వర్యంలో మరిన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయన్నారు. మండలిరద్దు తీర్మానం ఓటింగ్‌పై 18మంది వైసీపీఎమ్మెల్యేలు సభకు రాలేదని, తమఅధినేత నిర్ణయం తప్పన్న ఆలోచన వారిలో కొందరికి ఉందని ఈవిషయం తో రుజువైందన్నారు. దేశంలో 10రాష్ట్రాలు తమకు కౌన్సిల్ (మండలి) కావాలని కేంద్రానికి అభ్యర్థించుకున్నాయన్నారు.
తనపుట్టినరోజు కానుకగా రాష్ట్రానికి మండలిని కానుకగా ఇచ్చిన వై.ఎస్.నిర్ణయాన్ని కూడా ధిక్కరించేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రప్రజలే ఆలోచించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపక్షాన మండలిఉండాలన్న సదుద్దేశంతోనే నాటిపాలకులు మండలిని పునరుద్ధరించారన్నారు. జగన్ తనసొంత ఇంటికి రూ.43కోట్లు ఖర్చుచేశాడని, అలాంటివ్యక్తి మండలికి రూ.60కోట్లు ఖర్చుచేయ లేడా అని దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. 38బిల్లులు మండలికి వస్తే, రెండుబిల్లులకు మాత్రమే సలహాలు, సూచనలుచేశామని, ప్రజలఅభిప్రాయం తెలుసుకోమని చెప్పడమే తప్పన్నట్లుగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిరకాలుగా చేయాలో అన్నిరకాలుగా మండలిసభ్యుల్ని ఇబ్బందులకు గురిచేశారని , తననిర్ణయాన్ని కాదన్నారని ఇదంతా జరిగిందని, భవిష్యత్‌లో తనకు ఎదురుచెబితే అసెంబ్లీసభ్యులపైకూడా జగన్‌ఇలానే ప్రవర్తిస్తాడన్నారు. బీజేపీ వాళ్లుకూడా ప్రజలపక్షాన ఢిల్లీలో పోరాడి, మండలిరద్దుని ఆపాలని దీపక్‌రెడ్డి సూచించారు.
జగన్ పతనం ఆరంభమైంది : సత్యనారాయణరాజు.. అన్నివ్యవస్థలను తనకింద ఉంచుకోవాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కౌన్సిల్‌ను రద్దుచేశాడని, మండలి నిర్వహణకు రూ.60కోట్లు వృథా అవుతున్నాయంటు న్న ముఖ్యమంత్రికి తమసభ్యులను నామినేట్‌చేసినప్పుడు ఆ విషయం తెలీదా అని సత్యనారాయణరాజు ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాన్ని సెలెక్ట్‌కమిటీకి పంపడమే ఏదో తప్పని భావించిన ముఖ్యమంత్రి తనపతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడన్నారు. తనకు విధేయుడిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆర్డీవోస్థాయికి పంపినప్పుడే జగన్‌పతనం ఆరంభమైందన్నారు. దేశం లో ఎవరూ చేయనివిధంగా జగన్ ప్రవర్తిస్తున్నాడని, 5కోట్లమందికి ముఖ్యమంత్రి నన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించడంలేదన్నారు.
ఓటింగ్‌లోసభ్యుల్నే లెక్కించలేనివారు, పరిపాలనేం చేస్తారు : అశోక్‌బాబు.... మండలిరద్దు తీర్మానం బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు నాన్‌మెంబర్స్‌ను బయటకుపం పారని, అలానే మండలిలో కూడా సభ్యులుకానివారిని బయటకు పంపమంటే దాన్ని తప్పుపట్టారని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడటం, ఏవో కాగితాలు ఆయనకు చూపించడం జరిగిందని, తరువాతే 133మంది సభ్యులు మండలిరద్దు బిల్లుకి ఆమోదం తెలిపినట్లుగా స్పీకర్ చెప్పారన్నారు. 121మంది సభ్యులు న్నారని తొలుతచెప్పి, తరువాత 133అనడం జరిగిందన్నారు. సభలోని సభ్యుల్ని కూడా లెక్కించలేని ఈ ప్రభుత్వం, ప్రజలకు ఏం పరిపాలన ఇస్తుందని అశోక్‌బాబు ప్రశ్నించారు. వైసీపీకి ఉన్న151మందిలో 133మంది మద్ధతుపలికితే, మిగిలిన సభ్యులు ఏమయ్యారని, వారి పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు. నేటితో వైసీపీపని అయిపోయిందని, రేపటినుంచి (28వతేదీ) టీడీపీపోరాటం ఆరంభమవుతుందన్నారు. తీర్మానాలు చేసినంతమాత్రాన రాజధాని మార్పు, మండలిరద్దు అనేవి సాధ్యంకావన్నారు. చంద్రబాబుకి పేరొస్తుందనే జగన్ రాజధానిని తరలిస్తున్నాడని, మండలిని రద్దుచేశారని, మేమంతా మావ్యక్తిగతంకోసం పనిచేయడంలేదని, రాష్ట్రప్రజలకోసమే పనిచేస్తున్నామని, భవిష్యత్‌లోనూ చేస్తామని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు తెలిపారు.