ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్మో హన్ రెడ్డికి ఆత్రం చాలా ఎక్కువని విమర్శించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందిన రోజే, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు మండలి రద్దు విషయంలో కూడా ఆత్రం ఎక్కువైపోయిందని విమర్శించారు. 4 నెలలు ఆగితే మండలిలో వైకాపా బలం పెరిగేదని గుర్తు చేశారు. బలం ఉంది కదా అని తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో, 3 రాజధానుల బిల్లును మండలి అడ్డుకోవడంతోనే ఏకంగా రద్దు చేసారని అన్నారు. నిజానికి సెలెక్ట్ కమిటీ పెండింగ్ లో ఉండగా రద్దు చేయడం సాధ్యపడుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమేనని నారాయణ వ్యాఖ్యానించా రు. అసలు మండలి రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు.

narayana 28012020 2

జగన్ వైఖరి వల్ల రాజకీయ పార్టీలకంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ప్రభుత్వాలు సైతం ఐదేళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోయాయని, అధిక బలం ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శాసన మండలి లేదా విధానమండలి ఉండాలా, వద్దా అన్న విషయంలో సీపీఐ వైఖరి మేమే అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దు నిర్ణయం స్వార్ధ ప్రయోజనాల కోసం జరిగింది కాబట్టి ఖండిస్తున్నామని నారాయణ వ్యాఖ్యానించారు. మండలి ఉండాలి అని సీపీఐ ఎప్పుడూ కోరలేదని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో జగన్ నిర్ణయాలతో వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించా రు. అమరావతి అభివృద్ధి జరిగితే తనకు పేరు రాదని, తన మార్కు ఉండదన్న ఉద్దేశంతోనే రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

narayana 28012020 3

మొత్తానికి అమరావతిలో పరిస్థితి దారుణంగా తయారయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలి కానీ మూడుముక్కలాట తగదని నారాయ ణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అని జనాన్ని నమ్మిస్తూ పాలనను వికేంద్రీకరించడం సరికాదని హితవు పలికారు. విశాఖపట్నం నగరాన్ని కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, ఉన్నదాన్ని పాడుచేయకుండా ఉంటే చాలని నారాయణ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ముఖ్య మంతైన జగన్‌ను తాను తొలుత అభినందిస్తూ సమర్థ వంతంగా పనిచేస్తారని భావించానని, కానీ పరిస్థితి చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక భారతీయ జనతా పార్టీ మద్దతు ముఖ్యంగా అమిత్ షా భరోసా ఉందన్న అనుమానం నారాయణ వ్యక్తం చేశారు.. బీజేపీ పెద్దల మద్దతు లేకుండా ఇలాంటి నిర్ణయాలు జగన్ తీసుకుంటారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యా నించారు. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ తీర్మానాలు చేస్తే సరిపోదని, తదుపరి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు. అందుకే , వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని నారాయణ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read