ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల కమీషనర్ పై కులం అంటగట్టి, ఆడు ఈడు అంటూ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ రె-చ్చి-పో-తా-రో అని, ఏకంగా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంతో, అనూహ్య పరిణామాల నేపధ్యంలో, పోలీసులు అలెర్ట్ అయ్యారు. జగన్ ప్రెస్ మీట్ తరువాత, ఎక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు రె-చ్చి-పో-తా-రో అని, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రత పెంచారు.​ బందరు రోడ్డులో, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఉంది. ఇక మరో పక్క, జగన్ తన పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చెయ్యటం పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్​కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై సీఎం జగన్​ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్​కుమార్​ రేపు రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్​కు వివరించనున్నారు.

ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై సీఎం జగన్​ ఇప్పటికే గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్నికల కమిషనర్​తో గవర్నర్​ చర్చించనున్నట్లు సమాచారం. మరో పక్క జగన్ ప్రెస్ మీట్ పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ఎవరు చెప్పినా వినరు అనేదానికి ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. క-రో-నా వై-ర-స్‌ ప్రపంచం మొత్తం మహమ్మారిగా మారిందన్న చంద్రబాబు... క-రో-నా బా-రి-న-ప-డి-న వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయిందన్నారు. క-రో-నా-తో ఇప్పటివరకు 5వేల మందికి పైగా చనిపోయారని.. చైనా, ఇటలీలో ఔ-ష-ధా-ల దుకాణాలు తప్ప, అన్నీ మూసివేశారని తెలిపారు. మనుషుల ప్రా-ణా-ల కంటే ముఖ్యమా ఎన్నికలు అని ప్రశ్నించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, అధికారుల తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. వైకాపా శ్రేణులు పోలీసుల అండతో దౌ-ర్జ-న్యా-ని-కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. సీఎం జగన్​ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మర్చారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్రాన్ని పులివెందులగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పోలీసులు, అధికారుల అండతో వైకాపా నేతలు దౌ-ర్జ-న్యా-ని-కి పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయడం లేదని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు గెలిచే చోట అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు చెల్లవని చెప్పించారని వాపోయారు. ఎన్నికలు జరిగితే ప్రత్యర్థి పార్టీ ఒక్క స్థానం కూడా గెలవదా అని రామకృష్ణ ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటించకూడదా అని నిలదీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read