మంత్రి వర్గం మొత్తం మార్చేస్తున్నాం, ఇక మంచి రోజులు వస్తున్నాయి అంటూ, వైసీపీ హడావిడి చేసింది. ఇక కొడాలి నాని లాంటి మంత్రులు అయితే, మంత్రి వర్గంలో సమర్ధులు కావాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, సమర్ధులకు చోటు ఇస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక మంత్రి వర్గం సమర్ధులతో నిండి పోతుంది, పండగే పండగ అని ప్రజలు అనుకున్నారు. కానీ కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అయిన రెండో రోజే ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో మార్చాల్సింది మంత్రుల్ని కాదు, ప్రభుత్వాన్ని అని ప్రజలు అనుకుంటున్నారు. కొత్త మంత్రి వర్గం వచ్చినా అప్పుల ప్రవహం ఆగలేదు. మంత్రి వర్గం ప్రమాణస్వీకారం అయిన రోజే, రూ.2000 కోట్ల కొత్త అప్పు తీసుకున్నారు. ఇక పన్నులు బాదుడు కొనసాగుతూనే ఉంది. పరిశ్రమలు వాడే కరెంటు పై సుంకం పెంచారు. గృహాలకు వాడే విద్యుత్ సామర్ధ్యానికి మించి వాడితే, దానికి చార్జ్ వేస్తున్నారు. మీసేవా చార్జీలు పెంచారు. ఇలా పక్క అప్పులు, మరో పక్క పన్నుల బాధతో వాయిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందుల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉందో తెలిపే సంఘటన నిన్న తిరుపతిలో జరిగింది. హృదయ విదారకరమైన వార్తలు నిన్న తిరుపతి నుంచి వచ్చాయి.

jagan 13042022 2

పరిపాలన సరిగ్గా లేక పోతే, పరిపాలన తెలియక పోతే, పాలకుల్లో ముందు చూపు లేకపోతే ఏమి జరుగుతుందో, నిన్న తిరుపతిలో చూసాం. వెంకన్న దర్శనం కోసం, సహజంగానే వేసవిలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు క-రో-నా కూడా తగ్గిపోవటం, వరుస సెలవులు ఉండటంతో, భక్తులు పోటెత్తారు. సర్వ దర్శనం కోసం అనేక మంది వచ్చారు. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించటంలో, ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. అంత మంది భక్తులు వస్తారని తెలిసినా, ముందే సరైన ఏర్పాట్లు చేయలేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. కనీసం పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎక్కడా షల్టర్లు లేవు, కనీసం మంచి నీళ్ళు ఇచ్చే నాధుడు కూడా లేడు. తిరుమల లాంటి చోట కూడా, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. చేతకానితనంతో, భక్తులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మీడియా ముందు, గొప్పలు చెప్పే ప్రభుత్వ పెద్దలు, ఇలాంటి వాటి గురించి ఏమి చెప్తారో మరి. మంత్రులు మారిపోయారు, అద్భుతాలు జరుగుతాయని ప్రజలను నమ్మించి, చివరకు మళ్ళీ అదే చేతాకని పాలన కొనసాగిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read