ఎవరైనా మామూలు వ్యక్తులు ఒకట్రెండు రోజులు కనపడకపోతే పేపర్లోనో, సోషల్మీడియాలోనో ప్రకటనలు గుప్పిస్తారు. అటువంటిది షాడో సీఎంలాంటి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి గత కొద్దిరోజులుగా కనపడుటలేదు. దీనిపై సీఎం కానీ, ఆయన మంత్రులు కానీ నోరు మెదపటంలేదు. ఎందుకంటే ఆయన ఢిల్లీ పెద్దలు అప్పగించిన టాస్కులో బిజీగా ఉన్నారు. ఇటీవల వైసీపీకి చెందిన కేసులన్నీ దర్యాప్తు నత్తనడకన నడవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పులు దొరకడం వంటి కారణాల వెనక కేంద్ర బీజేపీ పెద్దల సహకారం ఉందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. బీజేపీ-వైసీపీ క్విడ్ ప్రోకోలో భాగంగా బాబాయ్ హత్యకేసు, లిక్కర్ కేసు వంటి వాటి నుంచి వెసులుబాట్లు ఇవ్వడం కేంద్రం చేస్తే, కర్ణాటక ఎన్నికల ఖర్చు మొత్తం వైకాపా భరించేలా ఒప్పందం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అని సర్వేలన్నీ తేల్చేస్తున్నాయి. వేలకోట్లు ఖర్చు చేసినా బీజేపీ గట్టెక్కే అవకాశంలేదంటున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల మూట్ల సాయంతోపాటు పోలింగ్ మేనేజ్మెంట్ లోనూ వైకాపా సాయం బీజేపీ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కడ ఉప ఎన్నికలైనా పెద్దిరెడ్డి ఓటర్లు, పెద్దిరెడ్డి టూరిస్టులు పెద్ద ఎత్తున దింపుతారు. ఈ ఎక్స్ పీరియన్స్‌ని కర్ణాటక ఎన్నికల్లో వాడుకునేందుకు పెద్దిరెడ్డిని బీజేపీ పెద్దలు తీసుకెళ్లారని సమాచారం. వేలకోట్ల డబ్బుని తరలించడంతోపాటు దొంగ ఓటర్లని తరలించే బాధ్యతలు పెద్దిరెడ్డే చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర బీజేపీ ఆదేశాలతో కర్ణాటకలో పనిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి చాలారోజులుగా ఏపీలో కనపడటంలేదని ఆయన పేషీకి వెళ్లిన వాళ్లు చెప్పే మాట.
మంత్రి పెద్దిరెడ్డి కొద్దిరోజులుగా కనపడుట లేదు.. ఏమైంది ?
Advertisements