తెలుగుదేశం పార్టీ మూడు పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన ఆనంద క్షణాల్లో మరో సర్వే టిడిపి విజయభేరీని కన్ ఫామ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరిగితే టిడిపినే అధికారంలోకి వస్తుందని తేటతెల్లం చేసింది. టిడిపికి 95 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలలో వెల్లడించింది. ఢిల్లీలో ఉన్న రైజ్ అనే సర్వే సంస్థకీ తెలుగు రాష్ట్రాలలో ప్రవీణ్ పుల్లట సీఈవోగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలలో 20 ఏళ్లుగా పనిచేశానని, తన అనుభవం రంగరించి రైజ్ సంస్థ సహకారంతో ఈ సర్వే చేపట్టానని ఆయన వెల్లడించారు. ఫీల్డ్ సర్వే, శాస్త్రీయబద్ధంగా శాంపిళ్ల సర్వేని తన టీము చేయగా.. రైజ్ సాఫ్ట్‌వేర్‌తో అందించిందని తెలిపారు. అదాన్ టివి తెలుగు ద్వారా ఈ సర్వే వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు మాసాలు, వందలాది మంది అనుభవజ్ఞులు చేసిన సర్వే ఇదని తెలిపారు. సెలెక్టివ్-ర్యాండమ్ మోడ్ అనుసరిస్తూ ఒక్కో నియోజకవర్గంలో 900 శాంపిళ్లు తీసుకున్నారు. జర్నలిస్టులు, పింఛనర్లు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, యువత, వ్యాపారుల నుంచి కూడా శాంపిళ్లు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఏడాది పైగానే ఉండడంతో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని..టిడిపి సింగిల్‌గా పోటీచేసినా 85-95 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే తేల్చింది. వైసీపీ 60-70 సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయని, అధికారానికి దూరంలో ఆగిపోతుందని సర్వేలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2024 సన్ `రైజ్` ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశమే.. సంచలనం సృష్టిస్తోన్న సర్వే
Advertisements