ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు జగన మోహన్ రెడ్డికి ఒక పెద్ద నమస్కారం పెట్టి బయటకు వచ్చామని, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు అన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు కలిసి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. పదే పదే మమ్మల్ని అమ్ముడు పోయారు అంటున్న జగన్ కు లేఖ రాస్తూ, పలు విషయాలు ప్రస్తావించారు. జగన్ వ్యవహార శైలి నచ్చకనే వైసీపీ నుంచి బయటకి వచ్చామని వారు తెలిపారు. ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి జగన్‌కు లేదని, ఆయనపై అసంతృప్తితోనే వైసీపీకి రాజీనామా చేశామని లేఖలో ఎమ్మెల్యేలు వివరించారు. మేము నీకు దండం పెట్టి బయటకు వచ్చినా, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అంటూ, వాపోయారు.
వైసీపీ నుంచి ఇప్పటివరకు టీడీపీలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 22కు చేరింది. వీరిలో రాయలసీమకు చెందిన ముగ్గురికి మంత్రిపదవులు లభించాయి. వీరిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డిలకి మంత్రి పదవులిచ్చారు. వీరికి మంత్రి పదువులివ్వడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ శాసనసభాపక్ష నేతకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం సమావేశాలను బహిష్కరించడంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై జనసేన అధనేత పవన్‌కల్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకున్నా ఎందుకు జీతాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వీరి దాడి తట్టుకోలేక, జగన్ ఎదురు దాడి ప్రారంభించటంతో, ఈ 22 మంది జగన్ కు లేఖ రసారు.