విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు నిధులు, ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అధికారులని ఢిల్లీ రమ్మని ఆహ్వానం పంపింది... తొలుత ఈ నెల 21 వ తేదీల జరగాల్సిన సమావేశం రెండు రోజులు వాయిదా పడటం జరిగింది... అయితే అనివార్యమైన పరిస్థితులలో భేటీ వాయిదా పడటంతో తదుపరి తేదీపై కేంద్రం దృష్టిని సారించింది.... ఇప్పటికే అధికారులు అన్నీ సిద్ధం చేసుకుని, ధీటుగా ఢిల్లీలో మన సమస్యలు వినిపించాలి అనుకున్న టైంలో, ఈ రోజు భేటీ లేదు అనే సమాచారం అందింది...
కాగా ఇదిలా వుండగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన వర్తమానం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదే శాల మేరకు అధికార యంత్రాంగం పూర్తి సమాచారంతో సిద్దమైంది. అదే విధంగా ప్రాధాన్యతా ప్రాతిపదికన మొత్తం 19 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది.... ఈ మేరకు నివేదిక కూడా సిద్ధమైంది... రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు...
అయితే, కేంద్రంలోని ఒక బలమైన నాయకుడు, ఈ భేటీ వాయిదా పడేలా చూసినట్టు తెలిసింది... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, రాజకీయంగా పై చేయి సాధించటానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. మార్చ్ 5 కంటే ముందు, ఏ విధమైన క్లారిటీ రాకూడదు అనే ఆ నేత ఇలా చేపించినట్టు సమాచారం... రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను చర్చించేందుకు మార్చి మొదటి వారంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెప్తున్నారు... ఫలితంగా తదుపరి తేదీపై సమాచారమివ్వాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు సమాచారం...