తెలుగుదేశం నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ కార్యాలయంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాగర్‌ సొసైటీలోని సీఎం రమేశ్‌ కార్యాలయంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. అయితే నిన్నితోనే సోదాలు ముగిసాయనే లీక్ ఇచ్చారు అధికారులు. సోదాల్లో ఏమి దొరకలేదనే సమాచారం కూడా బయటకు వచ్చింది. సియం రమేష్ కూడా మా ఇంట్లో వాళ్ళకి ఏమి దొరకలేదు, చిన్న పేపర్ ముక్క కూడా మా ఇంటి నంచి పట్టుకువెళ్ళ లేదని చెప్పారు. దీంతో ఇక అందరూ ఐటి సోదాలు ముగిసాయనే అనుకున్నారు. కాని మళ్ళీ ఈ రోజు ఉదయం, ఐటి అధికారులు సియం రమేష్ ఇంట వాలిపోయారు.

ramesh 13102018 2

ఈ పరిణామం ఊహించని మీడియా కూడా మళ్ళీ అక్కడ వాలిపోయింది. నిన్న ఏమి దొరకలేదని, ఎదో ఒకటి తీసుకురావాలని పై నుంచి ఒత్తిడులు ఉన్నాయి కాబట్టే మళ్ళీ వచ్చారని సియం రమేష్ అన్నారు. మీరు ఎన్ని వెతికినా, నా దగ్గర ఏమి ఉండవని, నేను అన్నీ చట్ట ప్రకరామే చేస్తున్నా అని అన్నారు. సీఎం రమేష్‌ సోదరుడు సురేష్‌ సమక్షంలో ఐటీ సోదాలు జరిగాయి. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్‌ దాఖలుపై సురేష్‌ను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేష్.. మా నుంచి ఎలాంటి పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశాడు. నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సురేష్‌ చెప్పుకొచ్చాడు. ఐటీ అధికారుల సోదాలకు తామేం భయపడేది లేదని ఆయన తెలిపాడు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ అడిగినందుకే ఐటీ దాడులు జరిగాయన్నాడు.

ramesh 13102018 3

నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సోదాల్లో దాదాపు 60 మంది అధికారులు పాల్గొంటున్నారు. ఈ సోదాలు రేపటి వరకూ కొనసాగవచ్చని సమాచారం. సీఎం రమేశ్‌‌ ఇళ్లు, కార్యాలయాలపై శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో మోహరించి తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు ఆయన సొంత ఊరైన కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 60 మంది అధికారులు బృందాలుగా విడిపోయి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కడపలో మరో ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజ్యసభలో విభజన హామీలపై గళమెత్తడం, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ దీక్షలు చేపట్టడంతో సీఎం రమేశ్‌పై కేంద్రం కక్షసాధిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read