ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది సేపటి క్రితం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో, మూడు రాజధానుల బిల్లు పై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో కొద్ది సేపటి క్రితం, హైకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రాగానే, ప్రభుత్వ తరుపు న్యాయవాది, మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని సంచలన ప్రకటన చేసారు. నిన్నటి వరకు రాజధాని రైతులు తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, శ్రీరాం, త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం అవుతూ ఉండటంతోనే, ఆయన రాష్ట్ర హైకోర్టులో, ఈ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని, దీని పైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. అయితే ఆయన స్టేట్మెంట్ విషయం పై స్పష్టత లేకపోవటంతో, కోర్టు మరోసారి ప్రశ్నించింది. మళ్ళీ అడ్వొకేట్ జనరల్ చెప్తూ, మూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉందో, సిఆర్డీఏ రద్దు చేయటం, ఈ రెండు బిల్లులు కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని, ప్రభుత్వం ఈ విషయం పై అసెంబ్లీలో స్పష్టత ఇస్తుందని చెప్తున్నారు.

jagan 22112021 2

మరి ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటి, మళ్ళీ ఏమైనా వారే రూపంలో వస్తారా ? లేక జగన్ మోహన్ రెడ్డి ఏమి చేస్తారు అనేది చూడాల్సి ఉంది. గత 700 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటికే న్యాయస్థానం టు దేవస్థానం అంటూ ప్రకటన చేసి, నడుస్తున్నారు. అలాగే వీరికి కూడా ఇబ్బందులు కలుగ చేసారు. అయితే మరో కీలక పరిణామం అమిత్ షా వచ్చి, బీజేపీ నేతల పై అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. తరువాత బీజేపీ నేతలు కూడా కదిలారు. అమిత్ షా నిర్ణయానికి, ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి లింక్ ఉందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల బిల్లులు వెనక్కు తీసుకుంది. ఈ నేపధ్యంలోనే, దీని వెనుక ఏమి జరిగింది అనేది చూడాలి. జగన్ ఏమి ప్రకటన చేస్తారో చూడాలి. దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అనేది చూడాల్సి ఉంది. కోర్టులో చెప్పారు కాబట్టి ఏమి జరిగిందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read