ఆర్ధిక శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేయటం కలకలం సృష్టిస్తుంది. ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ, ఈ ఉదయం, మూడు జీవోలు జారీ అవ్వటంతో, ఒక్కసారిగా సచివాలయంలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు, ప్రభుత్వానికి సంబంధించిన చాలా గోప్యత పాటించాల్సిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు మోపారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ పరిస్థితి పై, మీడియాలో వరుస కధనాలు రావటానికి, ఈ ముగ్గురి హస్తం ఉంది అంటూ, ఆ జీవోలో తెలిపారు. ఈ మూడు జీవోలు కూడా, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ షంషేర్ సింగ్ రావత్ జారీ చేసారు. ఈ ముగ్గురు ఉద్యోగాల్లో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్ లు, అసిస్టెంట్ సెక్రటరీ ఉన్నారు. డి. శ్రీనుబాబు, కె.వరప్రసాద్,సెక్షన్ ఆఫీసర్ లు కాగా, నాగులపాటి వేంకటేశ్వరులు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి గురించి చాలా గోప్యత పాటించాల్సిన సమాచారం, బయటకు లీక్ చేస్తున్నారని, ఆ జీవోలు పేర్కొన్నారు. అలాగే వీరి పైన విజిలెన్స్ ఎంక్వయిరీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎంక్వయిరీ పూర్తయ్యే వరకు కూడా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదని ఆ జీవోలో ఆదేశాలు జారీ చేసారు.

sec 04082021 2

ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని, ప్రభుత్వం భావించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ ఉత్తర్వులు చూస్తే ప్రధానంగా, నాగులపాటి వేంకటేశ్వరులు అనే వ్యక్తి, చాలా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని, మరో ఉద్యోగికి ట్రాన్స్ఫర్ చేసి, తద్వరా మీడియాకు పంపించటం జరిగిందని అందులో ఆరోపించారు. ఇది కాన్ఫిడెన్షియల్ విషయం అనే విషయం అని తెలిసినా కూడా, కావాలనే వారు ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేయటానికి పూనుకున్నారు అంటూ, ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మధ్య కాలంలో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వం అప్పులు కోసం చేస్తున్న అక్రమాలు, అన్నీ కూడా పయ్యావుల కేశవ్ బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఒకసారి 41 వేల కోట్లు, మరో సారి 25 వేల కోట్లు, మరో సారి 17 వేల కోట్లు, ఇలా అనేక అక్రమాలు బయట పెట్టారు. దీంతో పాటు మీడియాలో కూడా అనేక కధనాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి పై అందరికీ అవగహన వచ్చింది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read