నాలుగు రోజుల క్రిందట, ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాండ్యుయెంట్‌ లాంటి దిగ్గజ ఐటి కంపెనీలు, విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే... ఇప్పుడు రాష్ట్రానికి మరో రెండు భారీ ఐటి కంపెనీలు రావటానికి సిద్ధంగా ఉన్నాయి... రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి... విశాఖపట్నంలో, ఇప్పటికే ఒక వాతావరణం ఏర్పడింది... ఫిన్ టెక్, బ్లాక్ చైన్ హబ్ గా విశాఖ ఏర్పడింది... అదే సమయంలో అమరావతిలో ఐటీ పార్కు, ఏపీఎన్‌ఆర్‌టీ టెక్‌జోన్‌లో పదుల కొద్దీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తిరుపతికి పలు ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ యూనిట్లు వచ్చాయి. ఈ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది...

it 01042018

దీనిలో భాగంగానే సదర్‌లాండ్‌ గ్లోబల్‌ కంపెనీతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి దాదాపు 19 దేశాల్లో శాఖలున్నాయి. అమెరికాలోనే మూడుచోట్ల శాఖలున్నాయి. వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బ్యాంకింగ్‌, బీమా, బీపీవో, ఐటీ తదితర రంగాల్లో ఈ కంపెనీ సేవలందిస్తోంది. విశాఖపట్నం, అమరావతిల్లో ఎక్కడైనా ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. త్వరలోనే ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూల నిర్ణయం తీసుకొంటారని సమాచారం. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరొందిన నెట్‌మ్యాజిక్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కంపెనీతో చర్చలు జరిపింది. ఏపీలో ఐటీ, పరిశ్రమల రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించింది.

it 01042018

అన్నీ కుదిరితే రూ.600కోట్ల మేర ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఒక డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీని ఒప్పించే దిశగా మాట్లాడుతున్నారని సమాచారం. ఇప్పటికే అమరావతిలో పై డేటా సెంటర్‌ ఉంది. అనంతపురం జిల్లాలో డేటా సెంటర్‌ను పెట్టాలని నెట్‌మ్యాజిక్‌ కంపెనీకి ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే కియ అనంతపురానికి రాగా.. ఐటీలోను ఇలాంటి కంపెనీలు రావడం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు డెస్క్‌ఎరా కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చేందుకు మొగ్గుచూపుతోంది. ఈ కంపెనీతోను పలుమార్లు ఐటీశాఖ చర్చలు జరిపింది. ఈఆర్‌పీ సొల్యూషన్స్‌, ఐటీ సేవలు అందించడంలో ఈ కంపెనీ ఆగ్నేయాసియాలోనే మంచి స్థానంలో ఉంది. విశాఖపట్నంలో ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ఐటీశాఖ కోరుతోంది. సదరు కంపెనీ కూడా ఈ ప్రతిపాదనపై సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read