ఇచ్చిన మాటను నిలపెట్టుకుని, ఎన్ని కష్టాలు ఎదురైనా, రైతుల సంక్షేమమే ద్యేయంగా, అభివృద్ధి పధంలో ముందుకు దూసుతుపోతూ, మాటలతో కాకుండా చేతలతో ప్రజలకు అండాగా ఉంటున్న చంద్రబాబు, మరోసారి తన విశ్వశనీయతను చాటుకున్నారు.

"ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటున్నప్పటికీ స్వయంశక్తితో కష్టాల్లో ఉన్న రైతులు, వారి కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే రుణమాఫీ. రైతు కన్నీళ్లు తుడిచేందుకే రుణమాఫీ. ఆత్మహత్య అనే ఆలోచనే రైతుల్లో రాకుండా చూసేందుకే రుణమాఫీ" అని సిఎం చంద్రబాబు అన్నారు. రైతు సంతోషమే జాతికి ముఖ్యం.. అన్నదాతను ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. 3వ విడత రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా శనివారం తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడుతూ రైతుల రుణభారం రూ.24 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందన్నారు.

రూ.50 వేల వరకు రుణమాఫీ ఒకే దఫాగా చెల్లించామని, రూ.లక్షా 50 వేల వరకు 5 వాయిదాలలో రైతులకు చెల్లిస్తున్నామని, అందులో 3వ విడత ప్రస్తుతం చెల్లిస్తున్నట్లుగా వివరించారు. దీనికి అదనంగా 10 శాతం వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఆర్బీఐ తోడ్పాటులేకున్నా ప్రభుత్వం స్వశక్తితో రైతు రుణ ఉపశమనం కల్గించడం చరిత్రగా అభివర్ణించారు. 3వ విడతతో కలిపి ఇప్పటివరకు రూ.14 వేల కోట్లు అందించామన్నారు.

గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండాలని సిఎం ఆకాంక్షించారు. రైతు సంతోషంగా ఉంటే గ్రామం సంతోషంగా ఉంటుందని, గ్రామాల్లో సంతోషమే సమాజ సంతోషమన్నారు. రుణ ఉపశమన పత్రాలు సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని రైతులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేందుకే త్వరలో తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లుగా తెలిపారు. అయోవా వర్శిటీ కూడా దర్శిస్తానన్నారు. 9న కర్నూలులో మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తున్న విషయం ప్రస్తావిస్తూ అయోవా వర్శిటీ దానికి సాంకేతిక తోడ్పాటు అందిస్తోందన్నారు. అంతర్జాతీయస్థాయి విత్తనోత్పత్తి సంస్థలు 100కు పైగా కర్నూలు రానున్నట్లుగా తెలిపారు. రైతుల ప్రాథమిక అవసరాలు తీర్చి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, సూక్ష్మపోషకాలు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.

ప్రతి రైతు లోగిలి పశు సంపదతో కళకళలాడాలని, వ్యవసాయం, పశుపోషణ రైతుకు ఉభయతారకం కావాలన్నారు. ప్రతి ఇంటికి రెండు మూడు ఆవులు పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోనే పేదరికం నిర్మూలన సాధ్యమన్నారు. ప్రతి రైతు ఒక శాస్తవ్రేత్తగా ఆలోచించాలి, ఒక పారిశ్రామిక వేత్తగా ఆలోచించాలి.. ఆదాయం పెంచుకునే ఆలోచనలు చేయాలి.. నీటి విలువ తెలుసుకోవాలి.. జలవనరులు కాపాడాలి.. నీళ్లుంటే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు. వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రం కావాలన్నారు.

డ్రోన్ల ద్వారా సాయిల్ టెస్టింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నట్లుగా వివరించారు. రాబోయే వారం కూడా రుతుపవనాల ప్రభావం వల్ల సీమ జిల్లాలో వర్షాలు అధికంగా పడతాయనే విషయం ప్రస్తావించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, వాటర్ కన్జర్వేషన్‌పై దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read