దేశ రాజధాని ఢిల్లీలో, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తీవ్ర అవమానం జరిగింది. నలుగురు ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసి సంఘీభావం తెలపాలి అనుకుంటే, ఢిల్లీ పోలీసులు, గవర్నర్ అవమాన పరుస్తూ, నలుగురు ముఖ్యమంత్రులకు పర్మిషన్ ఇవ్వలేదు. అంతకు ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆంధ్రా భవన్ లో కలిసారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దకు వెళ్ళటానికి, ఢిల్లీ గవర్నర్ కు ఉత్తరం రాసారు. రాత్రి 9 గంటలకు కలుస్తామని చెప్పారు.
అయితే నలుగురు సియంలు బయలుదేరిన తరువాత, అనూహ్యంగా, గవర్నర్ భావనానికి వెళ్ళే దారులు అన్నీ పోలీసులు బ్లాక్ చేసారు. అక్కడకు వెళ్ళటానికి పర్మిషన్ లేదని చెప్పారు. గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. దీంతో, చేసేది లేక, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఇంటికి వెళ్లి, ఆయన తల్లి, భార్య, పిల్లలను పరమార్సించారు. అయితే, ఈ పరిణామం పై, నలుగురు సియంలు చాలా కోపంగా ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రులు కలిసి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి అంటే, ఇన్ని ఆంక్షలు పెడతారా ? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ, కేంద్రం పై మండి పడ్డారు. ఇదంతా, మోడీ చేస్తున్న కుట్రగా చెప్పారు. అయితే, ఈ విషయం పై ధర్నా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై చర్చిస్తున్నారు.
పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపటానికి వెళ్ళాలనుకున్నారు. మరో పక్క, దిల్లీ పాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న దిల్లీ సీఎం, మంత్రులపై కేసు నమోదైంది. దీక్షతో ఎల్జీ విధులకు ఆటంకం కల్గించారని ఆరోపిస్తూ అధికారులు నగరంలోని పటేల్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్, గోయల్ రాయ్‌పై పోలీసులు 124 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.