ఆంధ్రప్రదేశ్ లో, రూ.4468 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు అక్టోబర్ 3న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, జల వనరుల మంత్రి నితిన్గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యుల్ సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పర్యటనలో భాగంగా రూ.1928 కోట్లు విలువైన, 415 కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభిస్తారు. అలాగే రూ.2539.08 కోట్లు విలువైన 250 కిలోమీటర్ల, రహదారి పనులకుశంఖుస్థాపనలు చేస్తారు.
దీంతో పాటుగా కేంద్రమంత్రి గడ్కరీ విజయవాడ- ముక్త్యాల మధ్య కృష్ణా నదిలో జల రవాణాకు సంబంధించిన ప్రాజెక్టుకు పునాదిరాయి వేస్తారు. 82 కిలోమీటర్ల ఈ జలమార్గం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూన్లో తవ్వకపు పనులు ప్రారంభమయ్యాయని, జూన్ 2019 నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది.
Advertisements