జగన్ పార్టీ డబ్బుల డంప్ నంద్యాలలో బయట పడింది... ముఖ్యమంత్రి వాహనాల్లో డబ్బులు ఉన్నాయని, లైవ్ లోనే చెక్ చేసిన సాక్షి లైవ్ వాన్ లో, పాపం రాత్రి అంతా నిద్ర లేక, ఈ వార్త కవర్ చెయ్యలేక పోతున్నాయి..
తాజాగా, జగన్ పార్టీ నేత పలుకూరి వెంకటరామి రెడ్డి తమ్ముడు, దస్తగిరి ఇంట్లో డబ్బులు చూసి పోలీసులు షాక్ అయ్యారు... ఏకంగా అక్కడ డబ్బులు డంప్ ఉంది అని సమాచారం రావటంతో, నిన్న రాత్రి ఒంటి గంటకు, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి, లోకల్ పోలీసులు, కర్నూలు జిల్లా బనగానపల్లెలో దస్తగిరి ఇంట్లో సోదాలు చేశారు...
సోదాల్లో, 47 లక్షల 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన నగదుకు సంబంధించి వివరాలు చెప్పక పోవటంతో, అది అక్రమంగా ఎలక్షన్స్ కోసం వాడుతున్న డబ్బు అని తెలుసుకున్నారు. పట్టుబడిన నగదును నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంకా చాలా చోట్ల, దాదాపు 60-70 కోట్లు దాచినట్టు సమాచారం, ఇప్పటికే 30 కోట్లు దాకా పంచి పెట్టినట్టు, పోలీసులు భావిస్తున్నారు. నిన్న 67 మంది పులివెందుల నుంచి, వచ్చిన రౌడీలను అరెస్ట్ చేసి, 10 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే...