పారదర్శకానికి ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్న రోజులు ఇవి. దేశం మొత్తం ప్రభుత్వాలు, పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఆన్లైన్ లో పెడుతూ ప్రజలకు అందుబాటులో పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తారనే పేరు ఉండేది. ప్రతిదీ డాష్ బోర్డు కు అనుసంధానం అయి ఉంటాయి. రియల్ టైంలో, డేటా అంతా అప్డేట్ అవుతూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. అయితే ప్రభుత్వాలు కొన్ని మాత్రం రహస్యంగా ఉంచుతూ ఉంటాయి. అవి అందరూ అర్ధం చేసుకోవాల్సిందే. అందుకే రహస్య జీవోలు వదులుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు ఎంత రియల్ టైం పాలన చేసినా, పరిపాలనలో భాగంగా కొన్ని రహస్య జీవోలు విడుదల చేసే వారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇది ఆక్షేపించేది.

go 02092019 2

రియల్ టైం పాలన అంటూనే, రహస్య జీవోలు ఇస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎదో దాస్తుంది అంటూ, తమ సొంత మీడియాలో విపరీతమైన ప్రచారం చేసి, ప్రజలకు ఎదో జరిగిపోతుంది అనే భ్రమ కల్పించే వారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇదే విషయం పై తన పాదయాత్రలో ప్రస్తావిస్తూ, చంద్రబాబు రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని, పరిపాలనలో రహస్యం అంటూ ఏమి ఉండదని, అన్ని విషయాలు ప్రజలకు చెప్పాలని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి, ప్రజలకు ఆ రహస్య జీవోల్లో ఉన్నది ఏమిటో చెప్పాలి అంటూ రాజకీయ అంశంగా మార్చి, ప్రచారం చేసే వాళ్ళు. ఇదే విషయన్ని ప్రశాంత్ కిషోర్ టీం కూడా, సోషల్ మీడియాలో తిప్పేది.

go 02092019 3

అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయి, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మేము పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. అయితే అప్పట్లో ప్రభుత్వం చేసిన విధంగానే, ఇప్పుడు కూడా రహస్య జీవోలు విడుదల అవుతున్నాయి. అయితే పరిపాలనలో కొన్ని రహస్య జీవోలు సహజం. కాని, ఇక్కడ మాత్రం, అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే, 47 రహస్య జీవోలు జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రహస్య జీవోలు విడుదల చెయ్యటం పై మాత్రం, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా, అన్ని రహస్య జీవోలు ఎందుకు వాదులుతున్నారో చెప్పాలని, అసలు ఆ జీవోల్లో ఏముందో ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు. పోర్ట్ లపై వచ్చిన ఒక రహస్య జీవో, పెద్ద రాద్ధాంతం అయ్యింది. బందర్ పోర్ట్, తెలంగాణాకు ఇస్తూ, రహస్య జీవో విడుదల చేసారని టిడిపి గోల చెయ్యటంతో, కొన్ని రోజులకు ఆ జీవో అసలు ఇష్యూ చెయ్యనట్టు, ప్రభుత్వ వెబ్సైటు లో పెట్టటంతో, మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.a

Advertisements

Advertisements

Latest Articles

Most Read