చంద్రబాబు ఎప్పుడూ అంటూ ఉంటారు, మన పిల్లలకి సరైన ప్రోత్సాహం ఇవ్వలే కాని, ప్రపంచాన్ని జయిస్తారు అని... అలానే, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ఇప్పుడు ఏకంగా, మౌంట్ ఎవరెస్ట్ నే అధిరోహించింది, మన ఆంధ్రప్రదేశ్ యువత... ఎవరెస్ట్ పై నవ్యాంధ్ర పాతాకం గర్వంగా ఎగిరింది... మౌంట్ ఎవరెస్టు పై కీర్తిపతాకం ఎగురేసారు మన విద్యార్థులు... ఎవరెస్ట్ శిఖరాన్ని గురువారం 5గురు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు అధిరోహించారు. వారిలో జె.ప్రవీణ్(పెదవేగి,ప.గో),భాను సూర్యప్రకాశ్(కొత్తూరు,తూ.గో), జి.రాజు(గోలుగొండ,విశాఖ), వెంకటేశ్(చిట్టేడు,నెల్లూరు), ప్రసన్న(అడ్డతీగల,తూ.గో) ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే తరువాత బ్యాచ్ మరో 5గురు శనివారం శిఖరాగ్రం చేరే అవకాశం ఉంది.21మంది విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కితే అది ఆల్ టైం రికార్డు అవుతుంది.గతంలో 9మంది విద్యార్ధుల రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ దే.

everest 17052018 2

రెండేళ్లుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్ బాబు ద్వారా వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది.మూడు దశలుగా విద్యార్ధులకు శిక్షణ అందించారు.పాఠశాల స్థాయిలో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ తదితర శారీరక పోటీలలో 184మందిని తొలుత ఎంపిక చేశారు.విజయవాడ కేతనకొండ సిబిఆర్ అకాడమిలోవారికి ప్రాధమిక దశలో శిక్షణ ఇవ్వడం జరిగింది.వారినుండి మెరుగైన 65మందిని ఎంపిక చేశారు.రెండవ దశలో మనాలిలో,డార్జిలింగ్ లో మూడువారాలు శిక్షణ ఇచ్చారు. వీరినుండి 36మందిని ఎంపిక చేయడం జరిగింది.తరువాత దశలో లడఖ్ లో మైనస్ 30డిగ్రీల ఉష్ణోగ్రతలో శిఖరారోహణ తర్ఫీదు పొందారు.

everest 17052018 3

ఆ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే 22మందిని తీసుకుని ఎవరెస్ట్ అధిరోహించడం ప్రారంభించారు.అందులో ఒకరు మధ్యలో డ్రాప్ కాగా మిగిలిన 21మంది ఎవరెస్ట్ అధిరోహణలో ఉన్నారు.వారిలో 5గురు ఇప్పటికే గమ్యాన్ని చేరుకున్నారు. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకుని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్ధులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మంత్రి ఆనంద్ బాబు ప్రశంసించారు. ‘‘శిఖరారోహణ ద్వారా విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడుతుంది.పట్టుదల పెరుగుతుంది,కష్టాలను తట్టుకునే దృఢత్వం అలవడుతుంది,భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇది బాటలు వేస్తుంది.శిఖరారోహణ ద్వారా రాష్ట్రానికి ప్రతిష్ట పెంచారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్ధులను ప్రశంసించారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read