రేపు తిరుపతిలో ఒకే రోజు 8 ఐటి కంపెనీలను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ఐటి మంత్రి నారా లోకేష్ పాల్గుననున్నారు... 13 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆ కంపెనీలు ఇవే... 1.జోహో సాఫ్ట్ వేర్ కంపెనీ : ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ సాఫ్ట్ వేర్ సేవలు అందిస్తున్న జోహో... అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ జోహో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు,డిటిపి పాలసీ,రాయితీలు గురించి వివరించారు.తిరుపతిలో కంపెనీ ఏర్పాటు కు జోహో ప్రతినిధులు అంగీకరించారు.
రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర్లో అద్దెకు తీసుకున్న భవనంలో 200 మంది ఉద్యోగులతో జోహో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. త్వరలోనే సొంత భవనం నిర్మాణం చేసుకొని, వచ్చే మూడేళ్ళలో 5 వేల మందికి ఈ కంపెనీ ఉపాధి కల్పించబోతుంది... 2: ఏజిఎస్ హెల్త్... మెడికల్ కోడింగ్,డేటా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఏజిఎస్ హెల్త్...260 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఏజిఎస్ హెల్త్... 3: పారికర్ సాఫ్ట్ వేర్ కంపెనీ... 73 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న పారికర్...
4: ఎక్సాఫ్లూఎన్స్ కంపెనీ... 20 మంది ఉద్యోగస్టులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఎక్సాఫ్లూఎన్స్ .... 5: నేస్ కంపెనీ: 20 మంది ఉద్యోగస్టులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేస్... 6: ఏఎన్ఎస్ కంపెనీ..... 30 మంది ఉద్యోగస్టులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఏఎన్ఎస్ కంపెనీ .... 7: వైఐఐటి: 10 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వైఐఐటి కంపెనీ..... 8: ఇన్జెనిసిస్... 20 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఇన్జెనిసిస్...