ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపగా జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు. ఆధార్‌తో నకిలీల సమస్య తొలిగిపోయిందని, మరోసారి ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని, ఇదే ఆధార్‌ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని సిక్రి వెల్లడించారు.

aadhar 26092018 2

ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్‌దారులు వాదిస్తున్నారని, అయితే ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసిందని కోర్టు వెల్లడించింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్‌ మందికి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.

aadhar 26092018 3

అయితే మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ కోసం బలవంతం చేయరాదని, స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్‌ పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read