వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్ దగుల్బాజీ పనుల వల్ల నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయని దుయ్యబట్టారు... 13 కేసులు ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను, భారతీయ జనతా పార్టీ కాని, మోడీ కాని దగ్గరకు రానివ్వదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.... జగన్‌వి ఊరపంది ఆలోచనలు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు... .. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల పై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలు అధికారులపై విమర్శలు చేయడమా అని ప్రశ్నించారు...
అలాగే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. " నీ కుటుంబ చరిత్ర ఏంటో.. నా కుటుంబ చరిత్ర ఏంటో తేల్చుకుందాం" అని జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. మీ తాత రాజారెడ్డి చరిత్ర గుట్టువిప్పుతా అంటూ మంత్రి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బైరటీస్ గనులకోసం నర్సయ్యను రాజారెడ్డి హత్య చేయించారని సంచలన విషయం బయటపెట్టారు... నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు నుంచి, నువ్వు చేసిన అరాచకాలు తెలుసని, తేల్చుకుందాం రా అని సవాలు విసిరారు...
సీబీఐ, ఈడీ కేసులున్న నీవు నన్నే విమర్శిస్తావా?. నాపై జగన్, ఎంపీ విజసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వీడియో విడుదల చేశారు" అంటూ ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు... తమను విమర్శించే శక్తిని జగన్ ఎప్పుడో కోల్పోయారని, అధికారులను ప్రలోభపెట్టే జగన్ ఐఏఎస్‌ల కొంప ముంచారని దుయ్యబట్టారు... వీడియోలు, తమపై ఆరోపణల, అభివృద్ధి పై తాను చర్చకు సిద్ధమని చెప్పారు.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే చర్చకు వస్తానని సవాల్ చేసారు...