ఏపీ విపక్షం వైసీపీకి కీలక నేత గుడ్‌ బై చెప్పనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ క్రియాశీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారని తెలిసింది. సీఎం చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు జయదేవ్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

aadi 08012019

అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులంతా వైసీపీకి మద్దతివ్వాలని బహిరంగ ప్రకటన చేసిన ఆదిశేషగిరిరావు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఖాతాలో మరో వికెట్ పడిందని అంటున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్‌బాబుకు బాబాయ్‌ అని ఆదిశేషగిరిరావు... అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని‌కారణాలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆదిశేశగిరిరావు... అందుకే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని... ఏ పార్టీలో చేరే విషయం త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.

aadi 08012019

ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప‌లుద‌ఫాలుగా కుటుంబ‌స‌భ్యుల‌తోనూ, స‌న్నిహితుల‌తోనూ చ‌ర్చించిన ఆదిశేషగిరిరావు నేరుగా జగన్‌కు రాజీనామా లేఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్ప‌టికే సోద‌రుడి అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగారు. కాని జగన్ వైపు నుంచి సరైన గౌవరం లేకపోవటంతో, ఇక ఏ మాత్రం పార్టీలో ఉండటం స‌హేతుకం కాద‌ని అందువ‌ల్లే రాజీనామాకు సిద్ధమైన‌ట్టు స‌మాచారం. అయితే త్వరలో టీడీపీలో ఆదిశేషగిరిరావు చేరనున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే ఆదిశేషగిరిరావు మాత్రం, ఈ విషయం పై ఇంకా ఏమి చెప్పలేదు. అర్ధంత‌రంగా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలపై ఈ రోజు మీడియాతో చెప్పనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read