ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీలోకి వలసలు మళ్ళీ మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో, నలుగుర రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి, బీజేపీ పార్టీ, అదిగో ఇదిగో, అందరూ వచ్చేస్తున్నారు అంటూ హడావిడి చేసినా, ఎవరూ బీజేపీలో చేరలేదు. అయితే నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణాలో పర్యటన చేసారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే, ఇప్పటికే బీజేపీలో చేరిన సియం రమేష్, రాయలసీమలో బలమైన నేతలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాల్లో భాగంగా, తెలుగుదేశం పార్టీ బిగ్ షాట్ అయిన, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సంప్రదించి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దృశ్యా, ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు.
ఎన్నికల తరువాత రాజకీయ దాడులు పెరగటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల పై, వైసిపీ చేస్తున్న దాడులతో, గ్రామాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తతగా ఉంది. ఈ నేపధ్యంలోనే, రాయలసీమలో ప్రత్యర్ధుల పై దాడులు పెరిగాయి. ఆదినారాయణ రెడ్డి మెయిన్ టార్గెట్ అయ్యారు. ఈ రాజకీయ ఒత్తిళ్ళు నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీలో కంటే, కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీలో చేరితే, తన వర్గాన్ని ఈ దాడులు నుంచి కాపాడుకోవచ్చని, ఆదినారయణ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ దిశగా అలోచన చేసినా, ఎందుకో కాని ఆయన పార్టీ మారలేదు. ఇప్పుడు సియం రమేష్ మంత్రాంగం నడపటంతో, పార్టీ మారి, వైసిపీ రాజకీయ దాడులు నుంచి తన వర్గాన్ని కాపాడుకోవచ్చని, ఆది భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే, నిన్న హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆది నారాయణ రెడ్డి కలిసారు. సియాం రమేష్ దగ్గరుండి, తీసుకెళ్ళారు. అయితే, పార్టీ మారే విషయం మాత్రం, ఇంకా ఆది నారాయణ రెడ్డి ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఆది నారాయణ రెడ్డి, కడప ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయారు. రామసుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు పక్కన పెట్టి, చంద్రబాబు మాట విని, కలిసి పని చేసారు. అయినా అటు రామసుబ్బారెడ్డి, ఇటు ఆది నారాయణ రెడ్డి, ఇద్దరూ ఓడిపోయారు. మంత్రిగా ఉండగా, కడప జిల్లాలో, జగన్ కు సవాల్ విసురుతూ రాజకీయం చేసారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతో, వైసీపీ నుంచి అన్ని విధాలుగా ఒత్తిడులు ఉండటం, రాజకీయ దాడులు, ఇవన్నీ తట్టుకునే శక్తి లేక, బీజేపీలో చేరారు. అటు బీజేపీ కూడా, జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవటానికి, కోస్తాలో కమ్మ, కాపు సామజివర్గాన్ని, సీమలో రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీస్తుంది.