నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆనం తరుచూ ఆయన తన అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి చేస్తున్న అతితో, అక్కడ అధికారులు అందరూ సీనియర్ నేతలకు సరైన గౌరవం ఇవ్వటం లేదు అనేది ఆనం భావన. గతంలో కూడా అనేక సార్లు ఆయన ఇలా బహిరంగంగానే అధికారుల పై తమ అసంతృప్తి చూపించారు. పార్టీలో కొంత మంది పైనా ఆయన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పటి దాకా అయితే జగన్ ను ఎక్కడా విమర్శించలేదు. ఇక ఆనం తాజాగా మరోసారి తన అసంతృప్తి వ్యక్త పరిచారు. జిల్లా యంత్రాంగం తీరు పై అధికార పార్టీ సీనియర్ నేత విరుచుకుపడటం చూస్తే, వైసీపీలో ఏమి జరుగుతుందో అర్ధం అవుతుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో, ఎమ్మెల్యేలను పిలివకుండా, అధికారులు తమను అవమానించారని ఆనం వాపోయారు. ఎమ్మెల్యేలను ఎందుకు రిపబ్లిక్ డే వేడుకలకు పిలవలేదో చెప్పాలని, ఆనం అన్నారు. అసలు రిపబ్లిక్ డే వేడుకులకు ఎమ్మెల్యేలను ఏ కారణంతో ఆహ్వానం పంపలేదో చెప్పాలని అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. ఇది ముమ్మాటికీ తమ హక్కులకు భంగం కలిగించే విషయం అని, తమకు జరిగిన అవమానం పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం అని, అవసరం అయితే హైకోర్టుకు కూడా వెళ్తాం అని చెప్పారు.
అయితే ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదు అనేది మాత్రం, ఇప్పటికీ తెలియలేదు. ఎన్నికల కమిషన్ నుంచి ఇబ్బంది వస్తుందని పిలవలేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరి ఒత్తిడితో అయినా పిలవలేదా, మరేదైనా కారణమా అనేది తెలియాలి. అయితే, దీని పై అధికారులు మాత్రం, ఇప్పటికే స్పష్టత అయితే ఇవ్వలేదు. ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు ఇలా తరుచూ ఎందుకు జరుగుతుందో అని ఆనం అనుచరులు వాపోతున్నారు. రిపబ్లిక్ డే అనేది అధికారులు చేసే కార్యక్రమం అని, ప్రజాప్రతినిధులను అధికారులు ఎందుకు పిలవలేదు అంటూ, రాంనారయణ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రివేలేజ్ కమిటీ దగ్గరకు ఈ విషయం తీసుకుని వెళ్తాం అని ఆనం చెప్పారు అంటే, ఆయన ఈ విషయం ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం అవుతుంది. ఇది రాజ్యాంగ పరమైన హక్కులకు భంగం అంటూ ఆనం వ్యాఖ్యానించారు. అంతే కాదు, అవసరం అయితే ఈ విషయం పై అధికారుల పై హైకోర్టుకు కూడా వెళ్తానని ఆనం అంటున్నారు. ఇక అధికార పార్టీలో, సొంత పార్టీ నేతలే, తమ ప్రభుత్వం తీరు పై ఇలా బహిరంగంగా మాట్లాడటం, ఇప్పుడు చర్చనీయాంసం అయ్యింది.